నా ఇమేజ్‌కు, అనుభ‌వానికి స‌రిపోయే ‘గరుడవేగ’ !

డా.రాజశేఖర్ హీరోగా పవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం’. ఈ చిత్రంలో రాజశేఖర్ ఎన్.ఐ.ఎ. ఆఫీసర్‌గా కనిపిస్తారు. రాజశేఖర్ కెరీర్‌లోనే హయ్యస్ట్ బడ్జెట్ మూవీగా, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా డా. రాజశేఖర్ మాట్లాడుతూ…

నా కెరీర్‌లోనే బిగ్ బ‌డ్జెట్‌…
నా కెరీర్‌లోనే బిగ్ బ‌డ్జెట్ మూవీ `పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం`. దాదాపు ముప్పై కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి సినిమా తీశాం. అంత‌కు ముందు నేను తీసిన `గ‌డ్డం గ్యాంగ్`..త‌మిళ చిత్రం `సూదు క‌వ్వుమ్‌`కు రీమేక్‌. అలాగే, `మ‌హాంకాళి`..ఓ హిందీ సినిమాకు రీమేక్‌. ఆ రెండు సినిమాలు నా ఇమేజ్ కంటే త‌క్కువ‌గా ఉండ‌టంతో ప్రేక్షకాద‌ర‌ణ పొందలేదు. అయితే `పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం` నా ఇమేజ్‌కు, అనుభ‌వానికి స‌రిపోయే చిత్రం.

సినిమా ఎలా ప్రారంభ‌మైంది..
– ఏడాదిన్న‌ర నుండి నాకు హిట్స్ లేన‌ప్పుడు, న‌న్ను అంద‌రూ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా నటిస్తారా? లేదా విల‌న్‌గా న‌టిస్తారా? అని అడుగుతుండేవారు. ఆస‌మ‌యంలో ప్ర‌వీణ్ స‌త్తారుగారు న‌న్ను క‌లిశారు. ఆయ‌న నా `మగాడు` సినిమా చూసి దాని ఇన్‌స్పిరేష‌న్‌తో `మ‌గాడు 2` అనే టైటిల్‌తో 2006లో ఓ క‌థ‌ను త‌యారు చేసుకున్నారు. నేను మంచి హిట్స్ మీదున్నప్పుడు హ‌లీవుడ్ బాండ్ త‌ర‌హా సినిమాలు చేద్దామ‌ని చాలా మంది ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో అంటే ‘చేద్దాం సార్..’అనే వారు కానీ, ఎవ‌రూ చేయ‌డానికి ముందుకు రాలేదు. ఈ క‌థ విన‌గానే నాకు హాలీవుడ్ సినిమాలే గుర్తుకు వ‌చ్చాయి. స‌బ్జెక్ట్ విన‌గానే స్ట‌న్ అయ్యాను. త‌ను పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్‌తో వ‌చ్చాడు. నాకు క‌థ చాలా బాగా న‌చ్చ‌డంతో సినిమా చేస్తాన‌ని త‌న‌తో అన్నాను.

క్యారెక్టర్ గురించి..
పోలీస్, ఫారెస్ట్, ఆర్మీ, నేవీ ఇలా పలు డిపార్ట్‌మెంట్స్‌లో సమర్ధులైన వారిని ఎన్.ఐ.ఎ సభ్యులుగా సెలక్ట్ చేసుకుంటారు. వీరికి చక్కగా శిక్షణ ఇస్తారు. ఈ సినిమా విషయానికి వస్తే నేను, రవివర్మ సహా మిగిలినవారంతో ఎన్‌ఐఎ సభ్యులుగా కనిపిస్తాం. మా పై అధికారి పాత్రలో నాజర్‌గారు కనపడతారు. ఇక నా పాత్ర విషయానికి వస్తే ఎన్‌ఐఎ ఆఫీసర్ అయినా నాకు కూడా కుటుంబం ఉంటుంది. ఒక పక్క కుటుంబం, మరో పక్క వృత్తి..రెంటిని ఎలా బ్యాలెన్స్ చేశాననేదే సినిమా. సాధారణంగా ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు బాండ్ తరహాలో తెరకెక్కిస్తుంటారు. కానీ దర్శకుడు ప్రవీణ్ సత్తారుగారు బాండ్ తరహాలోనే సినిమాను తెరకెక్కిస్తూ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా మిక్స్ చేశారు.

నిర్మాత కోటేశ్వ‌ర్ రాజు గురించి…
– నేను ఈ సినిమా చేయడానికి మరో ప్రధాన కారణం జీవిత. ‘ఈ సినిమా నీకు కచ్చితంగా కమ్ బ్యాక్ మూవీ అవుతుంది..తప్పకుండా చేద్దాం’ అని చెప్పింది. ఈ కథతో కోటేశ్వరరాజుగారిని కలిశాం. ఆయనకు కథ నచ్చింది. సినిమాను భారీగానే చేద్దామని అన్నారు. అన్నట్లుగానే మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగా సినిమా నిర్మించారు.

ఫిట్‌గా ఉండటానికని..
వందేమాతరం, ప్రతిఘటన, అంకుశం సినిమాల సమయంలో నేను ఎంత ఫిట్‌గా అయితే ఉన్నానో, ఇప్పుడు కూడా అంతే ఫిట్‌గా ఉన్నాను. స్టంట్స్ విషయంలో మీరు కాంప్రమైజ్ కావద్దు, నేను కష్టపడటానికి రెడీ అని ప్రవీణ్‌కు చెప్పాను. అలాగే ఫిట్‌గా ఉండాలని నేను ట్రయినర్‌ను అపాయింట్ చేసుకుని రెడీ అయ్యాను.

హార్ట్ ఎటాక్ వచ్చింది…
మరో వారం పది రోజుల్లో షూటింగ్‌కు వెళదాం అనుకంటున్న తరుణంలో హార్ట్ ఎటాక్ వచ్చింది. ఛాతి అంతా నొప్పిగా ఉండేది. చెకప్ చేయిస్తే, అంతా నార్మల్‌గానే ఉందని చెప్పేవారు. చెన్నై అపోలో హాస్పిటల్‌కు వెళ్లి చెకప్ చేయించాను. వారు కూడా ఏం లేదని చెప్పారు. సరే హైదరాబాద్‌కు వచ్చేద్దామని బయలుదేరాం. దారిలో వాంతులు అయ్యాయి. దాంతో ఇంటికి కూడా వెళ్లకుండా నేరుగా హాస్పిటల్‌కు వెళ్లాం. ట్రాప్‌మాయ్ అనే టెస్ట్ ఉంది. దాన్ని చేసి చూద్దామని మళ్లీ అపోలోకు వెళ్లాం. అప్పుడు గుండెనొప్పి కారణమయ్యే ఓ ప్రొటీన్ శరీరంలో ఉంది. దాని వల్ల గుండె నొప్పి వస్తుందని అన్నారు. వెంటనే స్కానింగ్ సహా అన్నీ టెస్టులు మళ్లీ చేయించారు. ఆపరేషన్ చేసి స్టంట్ పెట్టారు. డాక్టర్స్ మూడు నెలలు విశ్రాంతి అవసరం అని అన్నారు. దీంతో యూనిట్ అంతా డల్ అయిపోయింది. కానీ నేను రెండు వారాల సమయం మాత్రమే తీసుకోమని, నేను షూటింగ్‌కు అటెండ్ అవుతానని చెప్పాను. ఎందుకంటే ఇంత మంచి సబ్జెక్ట్‌ను వదిలేస్తే, మళ్లీ జరగకపోవచ్చు అనుకుని, అన్నట్లుగానే రెండు వారాల్లో సిద్ధమయ్యాను.

‘Garuda Vega’ is a visually rich, gripping film: Rajasekhar 

Director Praveen Sattaru had visualized ‘Garuda Vega’ as a new-age, racy action thriller.  And he has translated his vision remarkably well, says Rajasekhar, the film’s subtle and measured NIA officer.   Read him talk about what is unique about the film, why Praveen Sattaru is a class apart, what made him accept the film, its high points, and more.
 
What makes you sound very confident about ‘Garuda Vega’?
 
I had always wanted to do films like ‘Bourne Identity, ‘Die Hard’ and ‘Lethal Weapon’ in a way that would suit the Indian sensibilities.  But no producer came forward with such an offer for years.  I am lucky that Praveen Sattaru came up with ‘GV’.
This has a gripping narration.  Rich visuals and an interesting screenplay make it a unique film for Telugu cinema.
 
What are you fighting for in the movie?
I am fighting for the country.  That’s all I can say for now.
 
Coming to the budget, what justifies the very high Rs. 25-30 Cr?
‘GV’ is my comeback movie.  Praveen came to me with this script.  He had called it ‘Magadu-2’ initially.  It was later titled ‘Garuda Vega’.  The estimated budget was Rs. 7-8 Cr.  When I wondered as to who will invest such a huge amount, Jeevitha told me that this film has to be done.  My father’s friend’s son was interested in making a movie.  Initially, when my father told me about this, I thought he was saying it in order to console me during my bad days.  But when we met Koteswar Raju garu (producer) in Chennai, we knew he was ready to do a film with us.
The same film could have been made in Hyderabad and such places.  But had it not been shot in Georgia, Malaysia and such places, it wouldn’t have got so much of grandeur.  That’s why the budget is totally rational.
 
You have been all praise for Praveen Sattaru.  What makes him a director to watch out for?
Praveen had come to us with a bound script.  I have worked with the likes of Muthyala Subbaiah, Raviraja Pinishetty and Kodi Ramakrishna garu.  All of them would improvise on the scenes during the shoot.  But Praveen never did it even once.  The entire shooting was completed in 93 days.
He has got a clear vision.  He has taken care of everything related to the film.  He even got involved in selling the film to distributors.
What makes this thriller different from other films?
 
It’s very realistic.  Our director took this up after doing a thorough research.  When we spoke to NIA officers, they told us that the kind of set-up we had created is very close to how it is in real life.  Even their behaviour is similar to how I behave in the film.
 
So, how did you approach the role, you being a known angry young man?
My director didn’t want me to act the way I did in ‘Ankusam’ and the like.  I am an NIA officer in the film.  And in such an officer’s life, finding suspects is a daily routine.  So, he wouldn’t behave like the hero of ‘Anuksam’ upon finding a suspect.  My acting in ‘GV’ is totally subtle and understated.  You will see a new Rajasekhar.
 
What kind of physical exercises did you put in?
I underwent a physical training for this movie.  It’s a James Bond-like movie where the hero has to do flight and parachute shots.  I promised the director that I will be as energetic as I was in ‘Prathighatana’ and ‘Vande Mataram’.  But a month before the shoot was to start, I had chest pain.  A stent was put in my left artery.  I was asked to take complete rest for one month.  But after just 10 days, I was ready to join the shoot.
 
How is the pre-release buzz?  We heard that in the US, about 80-100 premieres have already been planned.  
I would have been happy if the Teaser got even 1 million views.  But in the first five days, it got 5 million views.  It has so far got more than 7-8 million views.  The Trailer is a bigger hit.  Yesterday when I met Chiranjeevi garu, he told me that he and his team at his office had watched the trailer and talked about it!
 
Who all do you thank for the movie?
I thank my father, my producer, my director, and my wife.  This film is Jeevitha’s gift to me.  She had always wanted me to do a film like this.
Are you ready to play negative roles?
Yes.  Even if ‘Garuda Vega’ becomes a big hit, I will be ready.  I was looking to do roles like the one played by Arvind Swamy in ‘Dhruva’.  I wanted to act with Chiranjeevi garu and Ram Charan.  It’s always easy to play a villain.  A hero has to cry beautifully.  But a villain need not look handsome.  He can do anything by making his face dirty and yet he will be liked.
You became very emotional at the pre-release event.  Why has your mother’s death affected you so much?
 

I am feeling like a criminal.  I am guilty that I couldn’t save my mother.  My mother complained about pain in the stomach on the day when she died.  I spent five minutes’ of crucial time thinking about whether I should give her the same tablet that I had given her the previous day.  Had I administered her the same tablet on time, she might have been alive.