ఎన్ఐఎ ఆఫీస‌ర్ పాత్ర‌లో యాంగ్రీ మేన్ డా.రాజ‌శేఖ‌ర్‌

సమాజం లో అంతర్గతంగా జరుగుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు  ఆరికట్టడానికి  భారత ప్రభుత్వం చేత , స్థాపించబడ్డ సంస్థ “NIA” “ నేషనల్ ఇన్విష్టిగేషన్ ఏజన్సీ”2008  లో స్థాపించ‌బ‌డింది. పోలీస్ , పారా మిలటరీ, CBI వీటితో పాటు NIA అనే ఒక ఇన్విష్టిగేషన్ నిఘా సంస్థ ప్రజా శ్రేయస్సుకై  ఏర్పడింది. యాంటీ సోషల్ యాక్టివిటి అనగానే ముందుగా గుర్తుచ్చేది ఉగ్రవాదం. ఉగ్రవాదం అంటే అభం శుభం తెలియని ప్రజల్ని చంపడం మాత్రమే కాదు. యువతను పెడదోవ పట్టించడం , పది మందితో కలిసి ప్రజల్ని భయపెట్టడం , మారక ద్రవ్యలని పరాయి దేశం నుంచి తెచ్చి మన దేశం లోని సంపద ను అక్కడి కి తరలించడం ఇలాంటి కార్య కలాపాలు అన్ని ఉగ్రవాదం లోని బాగమే అటు వంటి అతీత శక్తుల్ని సమాజం నుంచి బహిష్కరించడమే NIA ధ్యేయం.

సరిగ్గా ఇటువంటి పాత్రలో నే `PSV గరుడవేగ126.18 ఎం` సినిమా లో డా. రాజశేఖర్ NIA ఆఫీసర్, శేఖ‌ర్ పాత్ర‌లో కనిపించబోతున్నారు. తనకు సహచరులు గా రవి వర్మ , చరణ్ దీప్ లు చేస్తున్నారు. ఒక గుండె బలానికి బుద్ది బలం, కండ బలం తోడైతే ఆ జట్టు ఎంత పటిష్టం గా వుంటుందొ అలా సాంకేతిక బలం తో రవి వర్మ , కండ బలంతో చరణ్ దీప్‌లు రాజశేఖర్ కి   కుడి ఎడమ భుజాల్ల వ్యవహరిస్తారు.ఎన్నో సవాళ్లు , ప్రతి సవాళ్లు తో కూడుకున్న ఆఫీసర్ శేఖర్‌కి . ప్ర‌తి చిన్న విష‌యాన్ని భూత‌ద్దంలో చూసే పై ఆఫీస‌ర్ స్థానంలో నాజ‌ర్‌, కొంచెం ఇంటికి లేటు గా వచ్చిన తను చెప్పిన పని చేయక పోయిన అలిగి కోపగించుకొనే భార్యగా పూజా కుమార్ మరో వైపు.  వీరి ఇద్దరి మధ్య ఛాలెంజ్ తో కూడుకున్న ఉద్యోగం అటు వంటి పరిస్థితులలో  వున్నా శేఖర్ కుటుంబాన్ని, ఉద్యోగాన్ని సమంగా చేస్తూ కుటుంబం లో చిన్న చిన్న కలహాల్ని ఎదుర్కొంటూ ఒత్తిడిని సైతం లెక్క చేయకుండా తన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాడు తన మిషన్నీ ఎంతటి వేగం తో పరిగేత్తిoచాడు అనేది కధాంశం….!  స్వతహాగా రాజశేఖర్ అంటేనే పోలీస్ పాత్రలో ఇమిడి పోయే స్వభావం వున్నా యాక్టర్. ఈ NIA క్యారెక్టర్ ని ఛాలెంజింగ్ తీసుకొని చేసుంటాడు అనడం లో అతిశయోక్తి లేదు. తనకు ఎదురైనా సవాళ్ళను ఎలా అధిరోహించాడు అనేది తెరపై న చూద్దాం.

రాజ‌శేఖ‌ర్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో పూజా కుమార్ గృహిణి పాత్ర‌లో న‌టిస్తుంది. జార్జ్ అనే క‌రుగుగ‌ట్టిన విల‌న్ పాత్ర‌లో కిషోర్  స‌హా నాజ‌ర్‌, జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో శ్ర‌ద్ధాదాస్‌,  పోసాని కృష్ణ‌ముర‌ళి, అలీ, పృథ్వీ, షాయాజీ షిండే, అవ‌స‌రాల శ్రీనివాస్‌, శ‌త్రు, సంజ‌య్ స్వ‌రూప్‌, ర‌వివ‌ర్మ‌, ఆద‌ర్శ్‌, చ‌ర‌ణ్ దీప్‌, ర‌వి రాజ్ త‌ది త‌రులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ః టిల్లి బిల్లి రాము, మేక‌ప్ః ప్ర‌శాంత్‌, ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్స్ః శ్రీనివాస‌రావు ప‌లాటి, సాయి శివ‌న్ జంప‌న‌, లైన్ ప్రొడ్యూస‌ర్ః ముర‌ళి శ్రీనివాస్‌, కాస్ట్యూమ్స్ డిజైన‌ర్ః బాబీ అంగార‌, సౌండ్ డిజైన్ః విష్ణు, విజువ‌ల్ ఎఫెక్ట్స్ సూప‌ర్ వైజ‌న్ః సి.వి.రావ్‌(అన్న‌పూర్ణ స్టూడియోస్‌), స్టంట్స్ః స‌తీష్‌, నుంగ్‌, డేవిడ్ కుబువా, కొరియోగ్రాఫ‌ర్ః విష్ణుదేవా, ఎడిట‌ర్ః ధ‌ర్మేంద్ర కాక‌రాల‌, ర‌చ‌నః ప్ర‌వీణ్ స‌త్తారు, నిరంజ‌న్ రామిరెడ్డి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ః శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, స‌మ‌ర్ప‌ణః శివాని శివాత్మిక ఫిలింస్‌, నిర్మాణంః జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి, సినిమాటోగ్ర‌ఫీః అంజి, సురేష్ ర‌గుతు, శ్యామ్ ప్ర‌సాద్‌, గికా, బాకుర్, సంగీతంః భీమ్స్ సిసిరోలియో, శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, ప్రొడ్యూస‌ర్ః ఎం.కోటేశ్వ‌ర్ రాజు, క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వంః ప్ర‌వీణ్ స‌త్తారు.

‘PSV Garuda Vega’: Introducing Team NIA

‘PSV Garuda Vega’, starring Dr. Rajsekhar in the role of a counter-terrorism fighter, is coming from the critically-acclaimed director Praveen Sattaru.

 “National Investigation Agency, India’s Central Counter Terrorism Law Enforcement Agency, was formed in the wake of the 2008 Mumbai terror attacks.  As a key member of an NIA team, Rajsekhar’s character epitomizes the challenges of work-life balance.  What goes into busting a terror conspiracy, the dedication that these personnel show in ensuring national security and the challenges they face are what the film narrates,” the makers say.
Rajsekhar’s wife is played by Pooja Kumar of ‘Vishwaroopam’ fame.  “His personal life is almost a disaster,” the director chips in.
Nasser, a demanding boss, plays the head of NIA operations and is based in Hyderabad.  Ravi Varma holds the forte with research and technical support.  Charan Deep wouldn’t refrain from smashing the noses as the team’s muscleman.  Together with Rajsekhar, they all make a formidable team ever ready to go beyond their mandate.
Kishore (‘Kabali’ fame) as George is the menacing villain.
Adith Eswaran of ‘Katha’ and ‘Tungabadra’ fame is playing a character that is on par with the main lead’s.  Shraddha Das is playing a TV journalist.   Sunny Leone comes as a special attraction with a massy dance number.
Adarsh, Shatru and Ravi Raj are playing trained assassins.   Srinivas Avasarala in a funny avatar will tickle the funny bone, while Ali is a psychologist (a bizarre one at that).  ’30 Years Industry’ Prudvi, for a change, is a nymphomaniac.  Shayaji Shinde and Posani are rival politicians.
Music-directed by Sricharan Pakala and Bheems, the film has BGM by the former.  Cinematography is by Anji, Gika Chelidze, Bakur Chikobava, Suresh Ragutu and Shyam.  Editing is by Dharmendra Kakarala.  Art direction is by Srikanth Ramisetty.  Stunts are by Nung, David Kubua and Satish.  Bobby Angara is the stylist.