న‌వంబ‌ర్ 3న డా. రాజ‌శేఖ‌ర్‌, ప్ర‌వీణ్ స‌త్తారు ` గరుడ‌వేగ `

తెలుగు చ‌ల‌న చిత్రాల్లో నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ(ఎన్ఐఎ) పై ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాలు రాలేదు. ఓ సిన్సియ‌ర్ ఎన్ఐఎ ఆఫీస‌ర్ దేశం కోసం, త‌న కుటుంబం కోసం ఏం చేశాడ‌నే క‌థాంశంతో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం` ప‌వ‌ర్‌పుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ల‌కు పెట్టింది పేరైన యాంగ్రీ యంగ్ మేన్ డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా సినిమా రూపొందుతోంది. మంచి క‌థ‌, ప‌వ‌ర్‌పుల్ హీరోయిజం, హృద‌యాన్ని తాకే ఎమోష‌న్స్‌, ఉత్కంఠ‌త రేపే స‌న్నివేశాలతో సినిమాను ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు తెర‌కెక్కించారు. ‘మ‌గాడు’ అంత ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో రాజ‌శేఖ‌ర్‌ను ప్రెజంట్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు ప‌డ్డ త‌ప‌న తెర‌పై సినిమా రూపంలో క‌న‌ప‌డుతుంది.
జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్ బ్యాన‌ర్‌పై 25 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో కోటేశ్వ‌ర్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డ‌నున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. టీజ‌ర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది.
ఈ సంద‌ర్భంగా నిర్మాత కోటేశ్వ‌ర్ రాజు మాట్లాడుతూ – “మా బేన‌ర్‌లో వ‌స్తోన్న తొలి సినిమా `పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం`. సినిమా ప్రారంభం నుండి ప్ర‌తి పాత్ర‌ను రివీల్ చేస్తూ, దేనిక‌దే ప్ర‌త్యేకం అనేలా అంద‌రిలో ఆస‌క్తిని క‌లిగించేలా ప్ర‌మోష‌న్స్ ప్లాన్ చేస్తూ వ‌చ్చాం. హీరోయిన్ పూజా కుమార్ ఇందులో గృహిణి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అదిత్ అరుణ్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. శ్ర‌ద్ధాదాస్ ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంది. కిషోర్ మెయిన్ విల‌న్‌గా న‌టించారు. పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌వివ‌ర్మ‌, నాజ‌ర్‌, పృథ్వీ, షాయాజీ షిండే త‌దిత‌రులు సినిమాలో న‌టించారు. ఇలా భారీ తారాగ‌ణం, సాంకేతిక నిపుణులతో మేకింగ్‌లో ఏ మాత్రం వెనుక‌డుగు వేయ‌కుండా సినిమాను హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందించాం. ప్రెస్జీజియ‌స్‌గా నిర్మించిన ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 3న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.
 
 రాజ‌శేఖ‌ర్‌, పూజా కుమార్‌, ఆదిత్‌, కిషోర్‌, నాజ‌ర్‌, ఆద‌ర్శ్‌, శ‌త్రు, ర‌విరాజ్‌లు ప్రొఫెష‌న‌ల్ కిల్ల‌ర్స్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నారు. శ్రీనివాస్ అవ‌స‌రాల కామెడి పాత్ర పోషిస్తున్నాడు. అలీ సైకాల‌జిస్ట్ పాత్ర‌లో, పృథ్వీ నింఫోమానియ‌క్ పేషెంట్‌గా, పోసాని కృష్ణ‌ముర‌ళి, షాయాజీ షిండే పొలిటిషియ‌న్స్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.
PSV Garuda Vega 126.18M’ to hit the screens on November 3rd

 
By now, it’s clear that Rajasekhar-starrer ‘PSV Garuda Vega 126.18M’ is one of the most well-made films in a long time.  Shot in five countries and in distinct locations, the Praveen Sattaru-directed movie comes with a strong story, an excellent hero, and a gripping screenplay.
“We are releasing the much-awaited movie on November 3rd.  We are very happy with the way our film has shaped up.  ‘PSV Garuda Vega’ is full of well-etched characters,” the makers say.
The makers add that there is a tight story that is told in the backdrop of richly-mounted scenes.  This fast-paced action thriller boasts of crazy, high-end action sequences featuring heavy-duty trucks, gigantic cranes, flipping cars and crushing vans.  Rajasekhar’s intense performance can’t be missed, the makers say.
And as the recently-released Teaser proves it beyond doubt, it has got breathtaking visuals.
Rajsekhar’s wife is played by Pooja Kumar of ‘Vishwaroopam’ fame.  Kishore (‘Kabali’ fame) as George is the film’s menacing villain.  Nasser, a demanding boss, plays the head of NIA operations and is based in Hyderabad.  Ravi Varma holds the forte with research and technical support.  Charan Deep wouldn’t refrain from smashing the noses as the team’s muscleman.
Adith Eswaran of ‘Katha’ and ‘Tungabadra’ fame is playing a character that is on par with the main lead’s.  Shraddha Das is playing a TV journalist.   Sunny Leone comes as a special attraction with a massy dance number.   Adarsh, Shatru and Ravi Raj are playing trained assassins.   Srinivas Avasarala in a funny avatar will tickle the funny bone, while Ali is a psychologist (a bizarre one at that).  ’30 Years Industry’ Prudvi, for a change, is a nymphomaniac.  Shayaji Shinde and Posani are rival politicians.
Music-directed by Sricharan Pakala and Bheems, the film has BGM by the former.  The cinematography is by Anji, Gika Chelidze, Bakur Chikobava, Suresh Ragutu and Shyam.  Editing is by Dharmendra Kakarala.  Art direction is by Srikanth Ramisetty.  Stunts are by Nung, David Kubua and Satish.  Bobby Angara is the stylist.