‘మెగాస్టార్’ కి డా.రాజ‌శేఖ‌ర్‌ వెరైటీ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విలక్ష‌ణ న‌టుడు డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా ‘అ!’ ఫేమ్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న త‌న చిత్రానికి సంబందించిన ప్రీ లుక్‌ను విడుద‌ల చేశారు. 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ ఫిలిం ఇది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో సినిమా తెర‌కెక్క‌నుంది.
 
రాజ‌శేఖ‌ర్ సినిమా ప్రీ లుక్‌లో 1983లో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఖైదీ పోస్ట‌ర్‌తో చిరంజీవికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇదే ఏడాది ఇండియా క్రికెట్‌లో వ‌ర‌ల్డ్‌క‌ప్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌ను కూడా ఈ పోస్ట‌ర్‌లో చూపించారు.
 
‘అ!’ వంటి వైవిధ్య‌మైన చిత్రంతో తెలుగు ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకున్న ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రాజ‌శేఖ‌ర్ సినిమా చేస్తుండ‌టం సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతుంది.ఆగ‌స్ట్ 26న రాఖీ పౌర్ణ‌మి సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌, ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు