‘డ్యూడ్’ (DUDE) ఓటిటి యాప్ గ్రాండ్ లాంచ్ !

ఓటిటి రంగంలో సరికొత్త వినోద విప్లవం ఆవిష్కరించేందుకు సమాయత్త మవుతోంది “డ్యూడ్”(DUDE) ఓటిటి. మే 15 న సినీ, అతిరధుల సమక్షంలో గ్రాండ్ గా “డ్యూడ్”(DUDE) ఓటిటి  యాప్ లాంచ్ ఘనంగా జరిగింది.
రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ… ఇంత చిన్న వయసులో అన్ని సెక్షన్స్ చూసుకుంటూ ఓటిటి రంగంలోకి ఎంటర్ అయ్యి ట్యాలెంట్ ఉన్న వారికి అవకాశం ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఈశ్వర్ టీం కు ‘అల్ ద బెస్ట్’ అని అన్నారు
దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ వీడియో బైట్ ద్వారా మాట్లాడుతూ… ఇప్పటి వరకు చాలా ఓటిటి లు చాలా వున్నా..డ్యూడ్ ఓటిటి ద్వారా  ఈశ్వర్, సాహిత్, క్రియేటివ్ టీం కలసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చేస్తున్న కొత్త ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
“డ్యూడ్” ఓటిటి వ్యవస్థాపకుడు ఈశ్వర్ మాట్లాడుతూ… డ్యూడ్ అనేది ఒక బ్రాండ్ కావాలి.డ్యూడ్ ఓటిటి అంటే నాది కాదు మనది. డ్యూడ్ ఓటిటి డోర్స్ ఎప్పుడూ ప్రతిభ ఉన్న వారిని వెల్ కం చెపుతుంది. అందుకే చాలా మంది ప్రొడ్యూసర్స్ గాని డైరెక్టర్స్ గానీ సీరియస్ గా అందరూ చెప్పేది ఒకటే ‘మీరు పంపించారు అంటే మేము మా దాంట్లో తీసుకుంటాం’ అని చెప్పారు. నాకు చాలా మంది ఇన్వెస్టర్ల నుండి కాల్స్ వస్తున్నాయి. మా డైరెక్టర్స్ అందరితో ఫ్యూచర్ ఫిల్మ్ కూడా చేపిస్తానని ప్రామిస్ చేస్తున్నాను. అలాగే నేను సంవత్సరానికి నాలుగు అవార్డ్స్ ఫంక్షన్స్ చేస్తాను వెండితెర బుల్లితెర ,డైరీ ఫంక్షన్,ఇలా ప్రతీది కూడావెబ్ స్ట్రీమింగ్ జూన్ నుంచి ఉంటుంది అన్నారు.
ఈస్ట్ వెస్ట్ సి.ఈ.ఓ రాజీవ్ మాట్లాడుతూ..  డ్యూడ్ అనేది కంటెంట్ మేకర్స్ కు ఇదొక స్కూల్. చాలా మంది ఎక్సపిరియన్స్ దర్శకులు ఈ బోర్డ్ లో వున్నారు. కొన్ని ఓటిటి లో ఇన్ బుల్ట్ కంటెంట్ పెట్టు కుంటారు. అంటే.. వారికి వారె డెవలప్ కావాలి. అంటే ఓన్ గా తనొక్కడే డెవలప్ అవుతాడు. అయితే డ్యూడ్ ఓటిటి అలా లేదు..అన్ని డిపార్ట్మెంట్స్ రమ్మని చెపుతూ.. ‘నాకు నేను డెవలప్ అవ్వను రండి మనందరం కలసి డెవెలప్ అవుదాము’అని అంటున్నారు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన “డ్యూడ్”(DUDE) ఓటిటి అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అన్నారు.