కొత్త కాన్సెప్టుతో.. స్టార్స్ తో చారిటీ క్రికెట్ మ్యాచ్ !

ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ…  బాధితులకు సేవలందిస్తుంది. మరింత మంది కి చేయూత నివ్వడానికి ముందుకు వచ్చిన ఈ సంస్థను సపోర్ట్ చేయడానికి టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) కెప్టెన్ హీరో శ్రీకాంత్, వైస్ కెప్టెన్ తరుణ్ లు ముందుకు రావడంతో ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ & ఎలైట్ మీడియా వారు ఆడియన్స్ (ఫ్యాన్స్) కు విన్నూతనమైన కొన్సెప్టుతో స్టార్స్ తో కలసి ఆడేందుకు  అవకాశం కలిపిస్తున్నారు. బిడ్డింగ్ లో పాల్గొని విన్ అయిన వారు  యూనివర్సల్ XL జట్టులో సభ్యులు అవుతారు.ఆ తరువాత అమెరికాలోని డల్లాస్ లో టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) తో బిడ్డింగ్ ద్వారా సెలెక్ట్ అయిన యూనివర్సల్ XL టీం పోటీపడుతుంది. ఈస్ట్ వెస్ట్ ఏంటర్టైన్మెంట్ & ఎలైట్ సంస్థలు ఏర్పాటు చేసిన  పాత్రికేయుల సమావేశంలో  టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) కెప్టెన్ హీరో శ్రీకాంత్, వైస్ కెప్టెన్ తరుణ్ జట్టు సభ్యులు తమన్ ,సుధీర్ బాబు, ప్రిన్స్, భూపాల్ తో పాటు ఈస్ట్ వెస్ట్ సభ్యులు,ఎలైట్ మీడియా సభ్యులు పాల్గొన్నారు. ఎలైట్ మీడియా అధినేత మురళి మెహన్ వీడియో బైట్ ద్వారా మాట్లాడారు.
ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్  సీఈవో రాజీవ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 24 వతేదీన డల్లాస్ లో ఎంటర్టైన్మెంట్ చేయడానికి మళ్లీ మీ ముందుకు వస్తున్నాము.23 న బ్యాంకేట్ నైట్ ఉంటుంది.ఇక్కడికి చాలా మంది హీరోయిన్స్ వస్తారు.అలాగే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. జబర్దస్త్ బ్యాచ్ కూడా అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. లోకల్ సింగర్స్, డ్యాన్సర్స్ వస్తారు. మీనాక్షి శేషాద్రి ఇన్స్ట్యూట్ ఉంది.దాంతో క్లాసికల్ డ్యాన్స్ ను కూడా మేము పరిచయం చేస్తున్నాము.. 24 క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది. 25న స్పాన్సర్స్ కోసం ఎక్స్క్లూజివ్ గా ఒక మ్యాచ్ ఆడుతున్నాం. ప్రతిఒక్కరూ కూడా సెలబ్రిటీస్ మీద ఆడాలి అనుకుంటే బిడ్డింగ్ లో పాల్గొని యూనివర్సల్ XL ద్వారా సెలబ్రిటీస్ తో క్రికెట్ మ్యాచ్ అడవచ్చు.
హీరో శ్రీకాంత్, హీరో తరుణ్ మాట్లాడుతూ… క్రికెట్ అంటే మా అందరికీ ఎంతో ఇంట్రెస్ట్. అయితే ఈస్ట్ వెస్ట్,ఏలైట్ మీడియా వారు మమ్మల్ని కలసి ఒక మంచి కాజ్ కోసం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము మా సపోర్ట్ కావాలన్నారు. డల్లాస్ లో క్రికెట్ ఆడడానికి సిద్ధమయ్యాము.అక్కడ వరప్రసాద్ గారు ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ & ఎలైట్ మీడియా వారు అరేంజ్ చేయడం జరుగుతుంది అని అన్నారు.
సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. ఒక మంచి కాజ్ కోసం ఈ పని చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో సుధీర్ బాబు, హీరో ప్రిన్స్  కూడా మాట్లాడారు.
ఈస్ట్ వెస్ట్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ కూడా పాల్గొన్నారు.