సందేశాత్మకంగా తెరకెక్కిన… ‘ఏక్’ చిత్ర సమీక్ష

రేటింగ్ : 3/5

కె వరల్డ్ మూవీస్ పతాకం పై బిష్ణు అధికారి,అపర్ణ శర్మ జంటగా సంపత్ రుద్రారపు దర్శకత్వంలో హరి ఈ చిత్రాన్ని నిర్మించారు.రిలీజ్ డేట్ : 14 జూన్ 2019
 
టెర్రరిజం నేపథ్యంలో సందేశాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ” ఏక్ ”. బిష్ణు అధికారి హీరోగా అపర్ణ శర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సుమన్ కీలక పాత్ర పోషించారు . ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? చూద్దామా !
 
కధాంశం :
బ్రిలియంట్ స్టూడెంట్ అయిన సిద్దూ అపర్ణ శర్మ ని ప్రేమిస్తాడు . అపర్ణ శర్మ కూడా సిద్దూ ని అమితంగా ఇష్టపడుతుంది . అయితే ఉగ్రవాదుల దాడిలో అపర్ణ శర్మ చనిపోతుంది . దాంతో సంఘ వ్యతిరేకులైన ఉగ్రవాదులను అంతం చేయాలనుకుంటాడు సిద్దూ . ఉగ్రవాదులను అంతం చేయడానికి సిద్దూ ఎంచుకున్న మార్గం ఏంటి ? అందులో సక్సెస్ అయ్యాడా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .
 
హైలెట్స్ :
కథాంశం
హీరో నటన
 
నటవర్గం :
ఉగ్రవాదులను , అరాచక వాదులను అంతం చేయాలనే సిద్దు పాత్రలో అద్భుతంగా రాణించాడు బిష్ణు అధికారి . నటనలోనే కాదు మంచి ఫిజిక్ తో కూడా ఆకట్టుకున్నాడు బిష్ణు . అపర్ణ శర్మ గ్లామర్ తో అలరించింది , అలాగే హిమాన్షి ఖురానా గ్లామర్ కే పరిమితం అయ్యింది . కీలక పాత్రలో సుమన్ చాలా బాగా నటించారు .అలాగే బెనర్జీ , శ్రవణ్ , 30 ఇయర్స్ పృథ్వీ తదితరులు తమ తమ పాత్రల్లో రాణించారు .
 
సాంకేతిక వర్గం :
నటీనటుల నుండి చక్కని నటన ని రాబట్టుకున్న దర్శకుడు సంపత్ రుద్రారపు యువతని ఆలోచింప జేసే విధంగా ఏక్ చిత్రాన్ని మలిచాడు .మంత్ర ఆనంద్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది , కెమెరామెన్ చక్రవర్తి విజువల్స్ కూడా బాగున్నాయి. నందమూరి హరి ఎడిటింగ్ బాగుంది. ఖర్చుకు వెనుకాడకుండా మంచి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించి తన నిర్మాణ దక్షతని నిరూపించుకున్నారు హరి . చిత్ర నిర్మాత, రచయిత హరి మాట్లాడుతూ.. టెర్రరిజమ్ బేస్డ్ సబ్జెక్టు ఇది..“మా చిత్రాన్ని పుల్వామా మృతులకు అంకితమిస్తున్నాం”..అని ప్రకటించడం అభినందనీయం. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ని  దర్శకుడు అజయ్ భూపతి రిలీజ్ చేయడం విశేషం.