మంచి మ్యూజిక్ తో ఫ్యాక్షన్ ప్రేమకథ “బంగారి బాలరాజు”

నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్లుగా కె. యం.డి. రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం “బంగారి బాలరాజు”. ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్స్ చిన్నికృష్ణ – చిట్టిబాబు లను సత్కరించారు.
 
ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ చిన్నికృష్ణ మాట్లాడుతూ… ముందుగా ఈ అవకాశం రావడానికి కారణం అయిన కోటేంద్ర గారికి అలానే రఫి గారికి, రాఘవేంద్ర రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఫ్యాక్షన్ ప్రేమకథ “బంగారి బాలరాజు” లో ఆరు పాటలు ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కోలా యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉండాలని ఈ “బంగారి బాలరాజు” మూవీ మా మ్యూజిక్ సిట్టింగ్స్ తో స్టార్ట్ అయ్యింది. అప్పట్లో కోటేంద్ర గారికి ఆయన ఫ్రెండ్స్ చాలా మంది కొత్తవారితో వద్దు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ తో వెళ్దామని సలహాలు ఇచ్చినా కూడా మాపై నమ్మకం పెట్టి, ఈ చిత్రాన్ని మాకు ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్. ఈ మధ్య విడుదలయిన “బంగారి బాలరాజు” ఆడియో సాంగ్స్ తో మా టాలెంట్ నిరూపించుకున్నామని అనుకుంటున్నామని తన ఆనందాన్ని తెలియజేసారు.
 
మరో మ్యూజిక్ డైరెక్టర్ చిట్టిబాబు రెడ్డిపోగు మాట్లాడుతూ… ముందుగా మా కోటేంద్ర అన్నగారికి థాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను, నా టాలెంట్ ని గుర్తించి, ఈ రోజు మాకు సత్కరించేంత మంచి మ్యూజిక్ ఇవ్వడానికి కారణం కోటేంద్ర అన్నగారే. ఈ చిత్రం లో అన్ని పాటలు ఇంత బాగా రావడానికి కోటేంద్ర అన్న ‘అనిత ఓ అనిత’ సాంగ్ ఎంత బాగా వచ్చిందో నాకు చెప్పి, ఆయన రాసిన లిరిక్స్ వినిపించి ఇలా ఉండాలి పాట అని వివరించి, మా నుండి మంచి పాటలు చేయించుకున్నారు. ఈ రోజు ఆయనతో పాటు మాకు ఒక ప్లాట్ ఫామ్ ని కలిగించారు. ఈ చిత్రం 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. “బంగారి బాలరాజు” చిత్రాన్ని ఆదరించి మన టాలీవుడ్ కి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కోటేంద్ర దుద్యాల అన్నగారికి, మంచి హిట్ తో మమ్మల్ని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అని తెలిపారు.
 
ఈ చిత్ర దర్శక నిర్మాతలు ఇంత మంచి మ్యూజిక్ ని అందించిన చిన్నికృష్ణ-చిట్టిబాబు లకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారిని శాలువాలతో సత్కరించారు. ఈ సత్కారం సాంగ్స్ రిజల్ట్ కు కాదు… వారు పెట్టిన ఎఫర్ట్ కు.. అని డైరెక్టర్ కోటేంద్ర తెలిపారు.