హీరోగా మారుతున్న గాయకుడు అద్నాన్ సమీ

గాయకుడిగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు ప్రముఖ సింగర్ అద్నాన్ సామి. సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీభాయ్‌జాన్’ మూవీలో క్లెమాక్స్ సాంగ్‌లో స్క్రీన్‌పై కనిపించిన అద్నాన్ సామి, యాక్టర్‌గా  ఎంట్రీ ఇస్తున్నాడు. రాధికారావు, వినయ్ సప్రే దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అప్ఘన్-ఇన్ సెర్చ్ ఆఫ్ ఏ హోం’. యాక్షన్, డ్రామా ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో అద్నానీ సామి లీడ్ రోల్ పోషిస్తున్నాడు. చిత్రయూనిట్ అద్నాన్ సామి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. తాజా లుక్‌లో అద్నాన్ సామి పసుపుపచ్చ రంగులో ఉన్న తలపాగాతో ఇంటెన్సివ్ లుక్‌లో కనిపిస్తున్నాడు.

ఈ సినిమాలో ఆయన అఫ్ఘానిస్తాన్‌లో పుట్టి పెరిగిన కళాకారుడిగా కనిపించనున్నారు. అనుకోని పరిస్థితుల్లో దేశం వదిలి వెళ్లిన ఆయన మరో దేశంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు ? అనేదే కథాంశం. భారత పౌరసత్వం లభించిన తర్వాత ఆయన చేపట్టిన మొదటి ప్రాజెక్టు ఇదే. బ్రిటన్‌లో  పుట్టి పెరిగిన  అద్నాన్‌కు ఏడాది క్రితం భారత పౌరసత్వం లభించింది. రాధికారావు, వినయ్ సప్రే  దర్శకత్వంలో పనిచేయటం చాలా సంతోషంగా ఉందని సమీ పేర్కొన్నారు. దశాబ్ద కాలంగా వీరిద్దరితో స్నేహబంధం కొనసాగుతోందని తెలిపారు.