ఇమేజ్ బాగుంది కానీ, ఇబ్బంది పెట్టేస్తోంది !

‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకులకి ముఖ్యంగా యువతకు సాయి పల్లవి ఫీవర్ పట్టేసుకుంది. ఒకే ఒక సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని ఫిదా చేసేసింది ఆ తమిళ పొన్ను. వరుస విజయాలతో అమ్మడు ఆఫర్స్ మీద ఆఫర్స్ ను అందుకుంటోంది .’ఫిదా’తో తెలుగు ప్రేక్షకులకి ముఖ్యంగా యువతకు సాయి పల్లవి ఫీవర్ పట్టేసుకుంది. ఆ సినిమాతో అమ్మడు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరినీ ఫిదా చేసి పడేసింది. అంతకు ముందే మలయాళంలో రెండు వరుస విజయాలు తన ఖాతాలో వేసుకున్న సాయిపల్లవిని ‘ఫిదా’ విజయంతో మరిన్ని ఆఫర్స్ పలకరిస్తున్నాయి.. కానీ ఏం లాభం… ఆ చిన్నది పెడుతున్న ఇబ్బందులతో దర్శక నిర్మాతలు అప్ సెట్ అవుతున్నారట…
ఒక్క సినిమాతో ఇక్కడ ఓవర్ నైట్ స్టారయి పోయిన సాయిపల్లవి ఇప్పుడు తనకు నచ్చిన కథల్నిమాత్రమే సెలెక్ట్ చేసుకొని… తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం సాయిపల్లవిని టాలీవుడ్ నిర్మాతలు యువరాణిలా ట్రీట్ చేస్తున్నారు. ‘వరుస సక్సెస్ లు వచ్చాయి కాబట్టి… టాలీవుడ్డేంటి.. ఏ వుడ్డయినా సాయిపల్లవికి దాసోహం అనాల్సిందే’ అని అంతా కామెంట్ చేస్తున్నారు. అంత వరకూ బాగానే ఉంది కానీ ఓ విషయం మాత్రం సాయిపల్లవి ఫ్యూచర్‌కు బ్రేక్ వేయబోతోందని తెలుస్తోంది…. సాయిపల్లవి షూటింగ్ లకు చాలా లేట్‌గా వస్తోందట. మరో రాజశేఖర్ లా తయారయ్యిందట. ఉదయం యూనిట్ మొత్తం రెడీగా ఉంటే …అమ్మడు తాపీగా మధ్యాహ్నంకు సెట్‌లో అడుగు పెడుతోందట. ఆ మధ్య ‘కణం’ చిత్రం షూటింగ్ అప్పుడూ, ఇటీవల ‘ఎం.సి.ఎ.’ సినిమా విషయంలోనూ అలానే జరిగిందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. వర్క్ పట్ల సీరియస్ నెస్ లేకపోతే లాంగ్ రన్ కష్టమని, ఇవాళ నెత్తిన పెట్టుకున్న నిర్మాతలే రేపు పట్టించుకోరని  సాయి పల్లవి పై విమర్శలు వస్తున్నాయి. వాటిని  దృష్టిలో పెట్టుకుని ఆమె తన  ప్రవర్తనను సరిదిద్దుకోవాలని ఆశిద్దాం