సినిమా లెక్కలపై ఆమెకు తెలివి తక్కువ !

సాయి పల్లవి ని చూసి మిగతా హీరోయిన్లు భయపడే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ‘ఫిదా’ తరువాత ఆమె డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది.ఇలాంటి సమయంలోనే  హీరోయిన్లు తమ పారితోషికాన్ని విపరీతంగా పెంచేసి ‘దీపముండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలి’ అన్న చందంగా వ్యవహరిస్తుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం తన రెమ్యునరేషన్‌ అందరికీ అందుబాటులో ఉండే విధంగానే చూసుకుంటోంది.త ఈ సినిమాకి ముందు ఆమె సినిమాకి 30 లక్షలు మాత్రమే తీసుకునేది. ఈ సినిమా తరువాత 70 లక్షలు అడుగుతోందట! రెమ్యునరేషన్‌ తక్కువగా ఉండడం, ఆమె ఉంటే సినిమా హిట్‌ అన్న టాక్‌ రావడం… వంటి కారణాలతో టాలీవుడ్‌లో చిన్న పెద్దా దర్శకనిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారట! ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా సాయి పల్లవి మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తోందనీ, ఓ విధంగా చెప్పాలంటే… సినిమా లెక్కలపై తెలివిలేకుండా వ్యవహరిస్తోందని కామెంట్ చేస్తున్నారు.

‘ఫిదా’ సినిమాతో ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుపోయింది సాయిపల్లవి. డాక్టర్ చదువుతున్న ఈచిన్నది సహజత్వానికి, విలువలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఈమధ్య సినిమా హీరోయిన్లతో షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయించటం బాగా అలవాటు అయింది. తాజాగా సాయిపల్లవిని కూడా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి రావాలంటూ ఆహ్వానించి పెద్దమొత్తంలో సొమ్ము కూడా ఇస్తామని ఆశ పెట్టారట. అయితే దీనికి  వెంటనే తిరస్కరిస్తూ.. ‘అలాంటి వాటికి నేను చాలాదూరంగా ఉంటా’నని ఈ మలయాళీ భామ చెప్పిందట. “ఏ హాస్పటల్ ప్రారంభోత్సమో లేక స్వచ్చంధ సంస్థల సేవా కార్యక్రమాలో అయితే ఓకే.. నేను ఖచ్చితంగా వస్తా.. వాటికొరకు నాకు ఎలాంటి డబ్బు ఇవ్వాల్సిన పనిలేదు…” అని నిర్మొహమాటంగా చెప్పేసిందని ఫిలింనగర్‌లో అనుకుంటున్నారు .