రజని అమీపై ఐదు కోట్ల పాట !

ఒకే ఒక్క పాట కోసం 5 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే తలైవా (నాయకుడు) రజనీకాంత్‌ రేంజ్‌ అది.12 రోజులు.. 5 కోట్లు .  రజనీ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ‘రోబో’కి సీక్వెల్‌గా లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘2.0’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఒక్క సాంగ్‌ మినహా ఈ సినిమా కంప్లీట్‌ అయింది. ఈ ఒక్క సాంగ్‌ను దాదాపు 5 కోట్లు ఖర్చు పెట్టి వేసిన సెట్‌లో 12 రోజుల పాటు చిత్రీకరించనున్నారట. రజనీకాంత్, అమీ జాక్సన్‌లపై ఈ రొమాంటిక్‌ సాంగ్‌ తీయనున్నారు. దీనికోసం చెన్నైలో గ్రాండ్‌గా ఓ సెట్‌ వేశారు. ‘‘మంచి డాన్స్‌కి స్కోప్‌ ఉన్న సాంగ్‌ ఇది. బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ సాంగ్‌. ఆ సాంగ్‌ పర్‌ఫెక్ట్‌గా రావాలంటే నేను కనీసం పది రోజులైనా రిహార్సల్‌ చేయాలి’’ అని అమీ జాక్సన్‌ పేర్కొన్నారు. ఈ ఐదు కోట్ల పాట అదిరిపోయేలా ఉంటుందని కోలీవుడ్   టాక్‌.