పవన్ పారితోషికం అక్షరాలా 40 కోట్లు

వచ్చే ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌ జనసేన పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీపడుతున్న విషయం వేరే చెప్పక్కర్లేదు. దీని కోసమై ఆయన ఇప్పటికే అంగీకరించిన చిత్రాలను అత్యంత వేగంగా పూర్తి చేయాలనుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మించబోయే చిత్రంలోనూ నటించనున్నారు.

అలాగే తాజాగా మరో చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. ఇటీవల రామ్‌తో ‘హైపర్‌’ చిత్రానికి దర్శకత్వం వహించిన సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్‌ నటించనున్నారు. ఈ చిత్రంలో ఆయన మరోమారు పవర్‌ఫుల్‌ పోలీస్‌గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో ఆయన నటించేందుకు తీసుకోబోతున్న పారితోషికం అక్షరాల 40 కోట్ల రూపాయలట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. తమిళ కథానాయకుడు విజయ్ నటించిన ‘పోలీస్‌’ చిత్రానికి రీమేక్‌గా ఈచిత్రం ఉండబోతోందని, ఈచిత్రం కోసం పవన్‌ ఏకంగా 55 రోజుల పాటు  డేట్స్‌ ఇచ్చారని, ఈచిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌లో చెప్పుకుంటున్నారు