రాఘ‌వేంద్ర‌రావు క్లాప్ తో ప్రారంభ‌మైన `మాటే మంత్రము` సీరియ‌ల్

గంగోత్రి స్టూడియోస్ బ్యాన‌ర్ పై ఎస్.ఎస్. రెడ్డి నిర్మిస్తోన్న `మాటే మంత్ర‌ము` సీరియ‌ల్ గురువారం ఉద‌యం హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియో లో ప్రారంభ‌మైంది.  పూజా కార్య‌క్ర‌మాలు అనంత‌రం  ముహూర్త‌పు స‌న్నివేశానికి ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు క్లాప్ ఇచ్చి, ద‌ర్శ‌కుడు ముళ్ల‌పూడి వ‌ర కు స్క్రిప్ట్ అందించారు.. ఇందులో  అలీ, ఆర్య, ప‌ల్ల‌వి, మానస హీరో, హీరోయిన్ల‌గా న‌టిస్తున్నారు. శివ పార్వ‌తి, క‌ళ్యాణి, రాగ మాధురి, వ‌రుణ్, తుల‌సి ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్నారు. ముళ్ల‌పూడి వ‌ర ఈ సీరియ‌ల్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ….
శివ‌పార్వ‌తి మాట్లాడుతూ, ` సినిమా, సీరియ‌ల్ రెండు స‌మాన‌మే. బుల్లితెర సీరియ‌ల్స్ కు ఎలాంటి ఆద‌ర‌ణ ల‌భిస్తుందో అంద‌రికీ తెలిసిందే. సీరియ‌ల్స్ పై  నాకు ప్రేమ పెర‌గ‌డానికి కార‌ణం అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారు. ఆయ‌న కూడా అప్ప‌ట్లో `మ‌ట్టి మ‌నిషి` అనే సీరియ‌ల్ లో న‌టించారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న సినిమా- సీరియ‌ల్ రెండు స‌మాన‌మే. సీరియ‌ల్ ఏమీ త‌క్కువ కాద‌ని ప్రోత్సాహంచారు. ఇక సిరియ‌ల్ విష‌యానికి వ‌స్తే మంచి క‌థ‌తో వ‌స్తున్నాం. సీరియ‌ల్ హిట్ అయి అంద‌రికీ మంచి పేరు వ‌స్తుందన్న న‌మ్మ‌కం ఉంది. జీ ఛాన‌ల్ లో వ‌చ్చే అన్నీ సిరియాల్స్ పెద్ద హిట్ అయ్యాయి. ఇది కూడా అలాంటి విజ‌యాన్ని అందుకుంటుంది` అని అన్నారు.
క్రియేటివ్ హెడ్ రామ్ వెంకీ మాట్లాడుతూ, ` ఈ సీరియ‌ల్ కు సంబంధించిన  ఓ ప్రోమో చేసి మార్కెట్ లోకి విడుద‌ల చేసాం. మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. లక్ష మందికి పైగా ఆ ప్రోమో రీచ్ అయింది. మంచి క‌థతో జీ ఛాన‌ల్ లో (8.30 నిమిషాల‌కు)  ప్రైమ్ టైమ్ లో టెలికాస్ట్ కాబోతోన్న సీరియ‌ల్ ఇది. అంద‌రు వీక్షిస్తార‌ని ఆశిస్తున్నాం. రేప‌టి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ కు వెళ్తున్నాం` అని అన్నారు.
హీరో ఆర్య మాట్లాడుతూ, ` అంద‌రికీ న‌చ్చే సీరియ‌ల్ ఇది. ఫ్యామిలీ ఎంట‌ర్. ప్ర‌తీ పాత్ర వాస్త‌వికంగా ఉంటుంది. క‌థ‌కు త‌గ్గ మంచి న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు కుదిరారు. మా సీరియ‌ల్ ను అంద‌రు ఆశీర్వ‌దిస్తారని కోరుకుంటున్నా` అని అన్నారు.
క‌ళ్యాణి మాట్లాడుతూ, ` నేను సినిమాల్లో న‌టించి సీరియ‌ల్స్ లోకి వ‌చ్చా. సినిమాలు క‌న్నా  సీరియ‌ల్స్ బాగున్నాయి. షూటింగ్ టైమ్ లో సెట్స్ లో  పండ‌గ వాతావ‌ర‌ణంలా ఉంటుంది. నిర్మాత స‌ర్వేశ‌ర్ రెడ్డి గారికి ఇండ‌స్ర్టీలో మంచి పేరు ఉంది. ఇప్పుడు ఆయ‌న సిరియ‌ల్స్ లో మేము అంతా న‌టించ‌డం చాలా సంతోషంగా ఉంది` అని అన్నారు. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో వ‌రుణ్, దినేష్, క్రియేటివ్ హెడ్ రామ్ వెంకీ త‌దిత‌రులు పాల్గొన్నారు.