భర్తతో మాత్రమే డాన్స్ చేస్తోంది !

‘బొమ్మరిల్లు’ సినిమాలో హాసినిగా అలరించిన జెనీలియాను తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు.డీ, బొమ్మరిల్లు, సాంబ, రడీ,సై, ఆరెంజ్ వంటి ఎన్నో  సినిమాల్లో కథానాయికగా నటించిన జెనీలియా ఆరేళ్ల క్రితం తెలుగులో రానా హీరోగా వచ్చిన ‘నా ఇష్టం’ సినిమా తర్వాత తెలుగుతెరపై కనిపించలేదు. అదే ఏడాది బాలీవుడ్‌ నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్నారామె. ఆ తర్వాత ఇప్పటి వరకు మూడు హిందీ సినిమాల్లో గెస్ట్‌గా మెరిసిన ఆమె ‘మౌళి’ అనే మురాఠి చిత్రంలో ఓ పాటలో నర్తించారు.
 
ఈ సినిమాలో ఆమె భర్త రితేష్‌ దేశ్‌ముఖ్‌ హీరో కావడం విశేషం. ‘‘జెనీలియాతో నటించే అవకాశాన్ని వదులుకోవాలనుకోను. ఈ సాంగ్‌లో నటించమని తనని అడిగా. నాలుగు సంవత్సరాల తర్వాత మేమిద్దరం కలిసి ఓ డ్యాన్స్‌ నంబర్‌కు కాలు కదపడం హ్యాపీగా ఉంది. ఇంతకుముందు జెనీలియా డ్యాన్స్‌లో ఎలాంటి మ్యాజిక్‌ ఉందో సేమ్‌ మ్యాజిక్‌ ఇప్పుడు కూడా ఉంది’’ అన్నారు రితేష్‌. ఈ సినిమాకు జెనీలియా నిర్మాతగా వ్యవహరించారు. నాలుగేళ్ల క్రితం ‘లయ్‌ భారీ’ అనే సినిమాలోని ఓ సాంగ్‌కు కలిసి నటించారు రితేష్‌ అండ్‌ జెనీలియా.