టాలీవుడ్‌లో రీ ఎంట్రీకి జెనీలియా ‘రెడీ’

జెనీలియా ‘బొమ్మరిల్లు’ తో బంపర్‌హిట్‌ అందుకుని, తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. కెరీర్‌ ఉన్నత స్థితిలో ఉండగానే బాలీవుడ్‌ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలకు దూరమయినప్పటికీ సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉండేది. భర్త రితేష్‌తో కలిసి ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ అనే ట్యాగ్‌ లైన్‌ను దక్కించుకుంది ఈ జంట. తాజాగా టాలీవుడ్‌లో రీ ఎంట్రీకి సిద్ధమైందట జెనీలియా. రామ్‌తో త్వరలోనే ఓ సినిమా చేయనున్నట్లు  వినికిడి.  వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రెడీ’ సూపర్ హిట్‌ అయిన సంగతి తెలిసిందే.

ఫోటోలు మాత్రమేనా.. రంభ కూడానా?…  తెలుగమ్మాయి రంభ తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ, భోజ్‌పూరీ భాషలలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది.  రంభ మొదట ‘ఆ ఒక్కటి ఆడక్కు’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని సాధించి.. ఆ తరువాత ముద్దుల ప్రియుడు, అల్లరి ప్రేమికుడు, రౌడీ అన్నయ్య, బొంబాయి ప్రియుడు, హిట్లర్‌​, బావగారు బాగున్నారా, హలో బ్రదర్‌, తొలిముద్దు, ఇద్దరు మిత్రులు వంటి చిత్రాల్లో నటించింది. అప్పటి స్టార్‌ హీరోలంరితోనూ జోడీ కట్టింది. చివరగా ‘దొంగ సచ్చినోడు’ సినిమాలో నటించింది.

2010లో కెనడాకు చెందిన ఇంద్రకుమార్‌ బిజినెస్‌మెన్‌ను వివాహం చేసుకుని.. పెళ్లి తర్వాత రంభ సినిమాలకు గుడ్‌బై చెప్పి కుటుంబంతో గడుపుతోంది. ఇటీవల  బుల్లితెరపై కొన్ని షోలకు వ్యాఖ్యాతగా చేసింది. అయితే తాజాగా రంభ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. అజయ్‌ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్‌ హీరోలుగా రూపొందుతోన్న చిత్రం ‘మహా సముద్రం’లో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జగపతిబాబు, శర్వానంద్‌పై ఓ స్పెషల్‌ సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ పాటలో రంభ ఫొటోలు, ఫ్లెక్సీలు కనిపిస్తాయి. దీంతో పాటలో రంభ ఆడిపాడనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి సాంగ్‌లో కేవలం రంభ ఫోటోలు మాత్రమే కనిపిస్తాయో.. లేక రంభ కూడా కనిపించనుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాలి.