‘జార్జ్ రెడ్డి’ నవంబర్ 22న వస్తున్నాడు !

‘‘జార్జ్ రెడ్డి’’.. 1965 నుంచి 1975 కాలంలో హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ..విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన స్టూడెంట్ లీడర్ ‘‘జార్జ్ రెడ్డి’’ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది..‘జార్జ్ రెడ్డి’ రిలీజ్ కు రెడీ అయింది..ఇప్పటికే బిజినెస్ పూర్తి చేసుకున్న ఈ మూవీని నవంబర్ 22న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు.
‘వంగవీటి’’ఫేం సందీప్ మాధవ్ (సాండి) లీడ్ రోల్ లో నటించిన ‘జార్జ్ రెడ్డి’ చిత్రానికి ‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి దర్శకుడు. మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి..సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
‘‘కేవలం ఒక్క ట్రైలర్ తోనే మా ‘‘జార్జ్ రెడ్డి’’ చిత్రం ‘టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ’ అయ్యింది. బిజెనెస్ పరంగా కూడా మాకు మంచి ఆఫర్లు వచ్చాయి.చివరకు ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ను అభిషేక్ పిక్చర్స్ -అభిషేక్ నామా సొంతం చేసుకున్నారు.వారికి థాంక్స్.సినిమా మీద మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నాం.ట్రైలర్ ఏ విధంగా ఇంట్రస్టింగ్ గా ఉందో..సినిమా కూడా దానికి ఏ
మాత్రం తగ్గకుండా ఉంటుంది.మా దర్శకుడు ఈ సినిమాను రియలిస్టిక్ గా తీసాడు.ఎక్కడా రాజీపడకుండా అందరం కష్టపడి ఈ సినిమా తీసాం.బయోపిక్ అయినా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి.అలాంటి కథ ఇది’’ అని నిర్మాతలు అన్నారు
 
మరాఠీ నటి దేవిక ‘‘జార్జి రెడ్డి’’ తల్లి పాత్రలో నటించటం విశేషం. ఇటీవల “నాల్” సినిమాకు గాను ‘బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్’ అవార్డ్ అందుకున్న శ్రీనివాస్ పోకలే ఈ సినిమాలో చిన్ననాటి జార్జ్ రెడ్డి పాత్రను పోషించాడు.యువ హీరో సత్య దేవ్ ఓ ప్రధాన పాత్ర చేసిన ఈ సినిమాలో ముస్కాన్, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు,వినయ్ వర్మ, తిరువీర్,అభయ్,మహతి నటీనటులు.
 
సంచలనాత్మక మరాఠి సినిమా ‘‘సైరాత్’’ కు ఫొటోగ్రఫీ అందించిన సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు ఫొటోగ్రఫీని అందించారు. సంగీతం -సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్- ప్రతాప్ కుమార్, ఆర్ట్- గాంధీ నడికుడికార్, అసిస్టెంట్ రైటర్స్- యాకుబ్ అలీ, అనిల్.సౌండ్ డిజైన్-ఖలీష,రాహుల్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్- హర్షవర్ధన్ రామేశ్వర్, కో డైరెక్టర్ -నరసింహారావు, అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ : దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి,కో ప్రొడ్యూసర్:సంజయ్ రెడ్డి, నిర్మాత:అప్పిరెడ్డి, రచన-దర్శకత్వం- జీవన్ రెడ్డి.