ఈమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి !

మెహ్రీన్‌ కౌర్‌ ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’  తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా విజయం సాధించినప్పటికీ ఆమెకు  అవకాశాలు రాలేదు. దాదాపుగా ఒక ఏడాది పాటు అవకాశం కోసం ఎదురు చూసింది మెహ్రీన్‌. ‘నిధానమే ప్రధానం’ అన్నమాట మెహ్రీన్‌కు సరిపోతుందేమో. ఈ ఏడాది ఆమె వరుసగా రెండు సినిమాలు చేసింది. దాంతో ఇక మెహ్రీన్‌ కౌర్‌కు అదృష్టం పట్టుకుంది. ఆమె నటించిన సినిమాలు వరుసగా హ్యాట్రిక్‌ విజయం సాధించాయి.

కొద్ది రోజుల క్రితం శర్వానంద్‌ నటించిన ‘మహానుభావుడు’ చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో మెహ్రీన్‌  బాగా నటించింది. ఆ చిత్రం ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా ఆనందంలో ఉన్న మెహ్రీన్‌కు… తాజాగా విడుదలైన రవితేజ ‘రాజా ది గ్రేట్‌’ ఓపెనింగ్స్ కూడా విజయానికి దగ్గరగా ఉండటంతో మరింత ఆనందాన్నిచ్చింది. ఈ విధంగా మెహ్రీన్‌ టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ రెండు సినిమాల విజయంతో ఆమెకు ఆఫర్లు కూడా వరుసకడుతున్నాయి. వరుణ్ తేజ్‌తో మెహ్రీన్‌ ‘జవాన్‌’ సినిమాలో  జత కట్టిన విజయం తెలిసందే. ఈ సినిమాకు బీబీఎస్‌ రవి దర్శకత్వంలో వహిస్తున్నారు.