రాజకీయాల్లోకి వచ్చేందుకు పార్టీలతో చర్చలు !

రజనీకాంత్, కమలహాసన్,విశాల్,ఉపేంద్ర కూడా  రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా వీరి బాటలోనే అందాల భామ అంజలి కూడా పయనిస్తోందని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం మొదలైంది. నిజానికి అంజలి పక్కా తెలుగమ్మాయి. రాజోలు నుంచి వచ్చిన అంజలి సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ మధ్య సన్నబడి మళ్లీ సినిమాల్లో సందడి చేస్తుందనుకుంటున్నఅంజలి వేరే టార్గెట్‌తో ముందుకు సాగుతోందని అనుకుంటున్నారు .  సినిమాల ద్వారా పాపులారిటి సంపాదించే హీరో హీరోయిన్లు, ఆ తరువాత రాజకీయాల వైపు అడుగులు వేయడం కొత్తేమీ‌కాదు.
అంజలి మొదట సక్సెస్ సాధించింది తమిళంలోనే. తమిళంలో విజయం సాధించిన ‘జర్నీ’ సినిమా డబ్బింగ్ వర్షన్ ద్వారా టాలీవుడ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత టాలీవుడ్‌లోనూ చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పటికీ తమిళంలోనే ఎక్కువగా అవకాశాలు దక్కించుకుంటున్న అంజలి, త్వరలో తమిళ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తోందట. దీనికి సంబంధించి పలు పార్టీల నాయకులతో అమ్మడు చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.
 ప్రస్తుతం తమిళ రాజకీయాలు అస్తవ్యస్తంగా ఉండటం, ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుండటంతో అంజలి రాజకీయాలపై ఫోకస్ పెంచినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కోలీవుడ్ యంగ్ హీరో జైతో ప్రేమాయణం సాగిస్తున్న అంజలి, ముందుగా పెళ్లికి ప్రయారిటీ ఇస్తుందా? లేక పాలిటిక్స్‌కు ఇంపార్టెన్స్ ఇస్తుందా? అన్నది అర్థంకావడం లేదు. మరి రాజోలు భామ తమిళ రాజకీయాల్లోకి నిజంగా అడుగుపెడుతుందో లేదో తెలియాలంటే మరి కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది .