కరిష్మా చేతుల మీదుగా ‘గ్లిట్టర్స్’ కు అవార్డ్

దక్షిణాదిలో అత్యుత్తమ శిక్షణ సంస్థగా ‘గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా అకాడెమీ’ పురస్కారాన్ని అందుకుంది. ఢిల్లీకి చెందిన యాప్స్ గ్రూప్ ‘రైసింగ్ లీడర్ షిప్’ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ నెల 21న గోవాలో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా అకాడెమీ దక్షిణాది నుంచి మొదటి స్థానంలో నిలిచింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ జీఎఫ్ఏకు ఈ పురస్కారాన్ని అందించింది.
రైసింగ్ లీడర్ షిప్ అవార్డు అందుకోవడంపై గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా అకాడెమీ సంస్థ ఛైర్మన్ దీపక్ బల్దేవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ…రైసింగ్ లీడర్ షిప్ అవార్డు మాకు దక్కడం గౌరవంగా భావిస్తున్నాము. మరింత ప్రభావంతంగా పనిచేసేందుకు మాకు ఈ పురస్కారం స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ రెండేళ్లలో మా సంస్థకు 7 అవార్డులు దక్కాయి. 2016 లో నాలుగు పురస్కారాలు రాగా…ఈ ఏడాది మూడు అవార్డులు అందుకున్నాం. మా సంస్థలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు తాము ఆశించిన లక్ష్యాలను చేరుకున్నప్పుడు మాకు ఈ పురస్కారాల దక్కడం కంటే ఎక్కువ ఆనందాన్ని కలుగుతుంది. ప్రతి విద్యార్థి విజయమే మా గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా అకాడెమీ విజయంగా భావిస్తాము. అన్నారు.
 
BOLLYWOOD HEROINE KARISHMA KAPOOR PRESENTED AWARD TO GFA
Hyderabad based famous film and media training institute GLITTERS FILM AND MEDIA ACADEMY won THE RISING LEADERSHIP AWARD organized by aps group, new delhi. it ranked top among all south indian institutes. the gala event was organized in Goa in a star hotel on 21st of july, Bollywood star actress Karishma Kapoor presented the award to Glitters film academy chairman Mr Deepak Baldev  on receiving the award mr deepak baldev said its a very great honor for us , which keeps us motivated doing quality work , this is 7th award in span of 2yrs we received 4 awards in 2016 & sofar 3 awards in 2017 . Now my aim is that our students should reach such heights in there respected career which will satisfy us more than the awards we receive .the success of each of our student is important as i feel my students success is our success