ఈ ఏడాది ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డుల విజేతలు

ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్ అవార్డులను విజేతలకు అందజేశారు. బెవర్లీ హిల్స్‌లో జరిగిన ఈవెంట్‌లో వీటిని ప్రజెంట్ చేశారు. అమెరికా కమీడియన్ సేత్ మేయర్స్ ఈ అవార్డులకు హోస్ట్‌గా వ్యవహరించారు. ‘హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్’ ఈ అవార్డులను ఎంపిక చేస్తుంది. ఫిల్మ్, టీవీ క్యాటగిరీల్లో ఈ అవార్డులను అందజేస్తారు.

గోల్డెన్ గ్లోబ్ విజేతలు వీళ్లే..
బెస్ట్ డ్రామా : త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిసోరీ
బెస్ట్ కామిడీ-మ్యూజికల్ : లేడీ బర్డ్
బెస్ట్ యాక్టర్, డ్రామా : గ్యారీ ఓల్డ్‌మ్యాన్, డార్కెస్ట్ అవర్
బెస్ట్ యాక్ట్రెస్: ఫ్రాన్‌సెస్ మెక్‌డార్మెండ్, త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్
బెస్ట్ యాక్టర్, కామిడీ-మ్యూజికల్ : జేమ్స్ ఫ్రాంకో, ద డిజాస్టర్ ఆర్టిస్ట్
బెస్ట్ యాక్ట్రెస్, కామిడీ-మ్యూజికల్ : సైర్సీ రోనన్, లేడీ బర్డ్
బెస్ట్ డైరక్టర్ : గులెర్మో డెల్ టోరో, ద షేప్ ఆఫ్ వాటర్
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : శ్యామ్ రాక్‌వెల్, త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిసోరీ
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్: అలిజన్ జెన్సీ ఐ, టోన్యా
బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ : కోకో
బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ : ఇన్ ద ఫేడ్, జర్మనీ-ఫ్రాన్స్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ : దిస్ ఈజ్ మి, ద గ్రేటెస్ట్ షోమాన్
బెస్ట్ టీవీ డ్రామా సిరీస్ : ద హ్యాండ్స్‌మేడ్ టెయిల్
బెస్ట్ టీవీ కామిడీ : ద మార్వలెస్ మిస్సెస్ మేయిసల్
బెస్ట్ యాక్టర్, టీవీ డ్రామా : స్టెర్లింగ్ కే బ్రౌన్, దిస్ ఈజ్ అస్
బెస్ట్ యాక్ట్రెస్, టీవీ డ్రామా : ఎలిసాబెత్ మోస్, ద హ్యాండ్‌మెయిడ్స్ టేల్
బెస్ట్ యాక్టర్, మ్యూజికల్ : అజిజ్ అన్సారీ, మాస్టర్ ఆఫ్ నన్
బెస్ట్ యాక్ట్రెస్ టీవీ కామిడీ : రేచల్ బ్రోస్నన్, ద మార్వలెస్ మిస్సెస్ మేజల్
బెస్ట్ టీవీ మూవీ, లిమిటెడ్ సిరీస్: బిగ్ లిటిల్ లైస్, హెచ్‌బీఓ

గోల్డెన్ గ్లోబ్ గెలుచుకున్న భారత సంతతి నటుడు

భారత సంతతి నటుడికి తొలిసారి గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఈ యేటి వేడుకల్లో అజిజ్ అన్సారీ.. టీవీ సిరీస్‌లో ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. ద మాస్టర్ ఆఫ్ నన్ అన్న కామిడీ సిరీస్‌లో అజిజ్ అన్సారీ నటించాడు. అవార్డును గెలుచుకోవడం సంతోషంగా ఉందని 34 ఏళ్ల అజిజ్ తెలిపాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ద మాస్టర్ ఆఫ్ నన్ సిరీస్ వస్తోంది. 2016లోనూ ఇదే సిరీస్ కోసం అన్సారీ నామినేట్ అయ్యాడు. కానీ ఈ సారి అన్సారీ అవార్డును గెలుచుకోవడం విశేషం. కామిటీ క్యాటగిరీలో గోల్డెన్ గ్లోబ్ గెలుచుకున్న మొదటి ఆసియా నటుడు కూడా ఇతనే. ఆంధోనీ అండర్సన్, కెవిన్ బీకన్, విలియమ్ మాకీ, ఎరిక్ మెక్‌కార్మాక్ నుంచి అన్సారీ గట్టి పోటీ ఎదుర్కొన్నాడు.

న‌టీమ‌ణులు న‌లుపు రంగు వ‌స్త్రాలు ధ‌రించి నిర‌స‌న 

ప్రొడ్యూసర్ హార్వే వెయిన్‌స్టిన్‌పై వచ్చిన ఆరోపణలతో హాలీవుడ్‌లో యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప‌లు నిర‌స‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలి సిందే. వెయిన్‌స్టిన్‌కు వ్యతిరేకంగా ట్విట్టర్‌లో మీ టూ ఉద్యమం కూడా వెల్లువెత్తింది. ఆ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు మరో కార్యక్రమాన్ని చేపట్టారు. తమ ఉద్యమాన్ని తీవ్ర తరం చేసేందుకు టైమ్స్ అప్ ప్రాజెక్టు కోసం హీరోయిన్లు నిధులు కూడా సేకరిస్తున్నారు. ఈ ప్రచారానికి మేటి హాలీవుడ్ హీరోయిన్లు నటాలీ పోర్ట్‌మాన్, రీస్ విదర్‌స్పూన్, కేట్ బ్లాంచెట్, ఈవా లొంగోరియా, ఎమ్మా స్టోన్‌లు చేయూతనిస్తున్నారు. అయితే రీసెంట్‌గా జ‌రిగిన అవార్డు వేడుక‌లోను ప‌లు అంశాల‌కి సంబంధించి హాలీవుడ్ న‌టీమ‌ణులు నిర‌స‌న చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తాజాగా జ‌రిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక‌లో ఒక‌రిద్ద‌రు మిన‌హా న‌టీమ‌ణులంద‌రు న‌లుపు రంగు వ‌స్త్రాలు ధ‌రించి నిర‌స‌న తెలియ‌జేశారు. అంతేకాకుండా వారికి మ‌ద్ద‌తుగా న‌టులు కూడా స‌మాన పారితోషికం గురించి చెప్పే 50-50 అని రాసి ఉన్న బ్యాడ్జిల‌ను కూడా ధ‌రించారు. సీనియ‌ర్ న‌టీమ‌ణులు మెరిల్ స్ట్రీప్‌, ఓప్రా విన్‌ఫ్రే, ఆష్లీ జ‌డ్ వంటి వారు యువ న‌టీమ‌ణుల‌కు మార్గ‌ద‌ర్శం చేశారు. తామంతా ఒకటే అనేలా చాటి చెప్ప‌డానికి హీరో, హీరోయిన్స్ గ్రూఫ్ ఫోటోలు దిగారు. నిర్మాత‌ హ‌ర్వీ వీన్‌స్టెయిన్ లైంగిక వేధింపుల ఘ‌ట‌న‌, న‌టుల‌తో స‌మానంగా పారితోషికం, గుర్తింపు లేక‌పోవ‌డం వంటి అంశాల‌కు సంబంధించిన అంశాల‌పై అవార్డులు గెల్చుకున్న న‌టీమ‌ణులు కూడా త‌మ ప్ర‌సంగాల్లో ప్ర‌స్తావించ‌డం ఇక్క‌డ గ‌మ‌న‌ర్హం. ఏదేమైన అవార్డు వేడుక‌ల‌లో ర‌కర‌కాల రంగుల బ‌ట్ట‌ల‌తో మెరిసే అందాల భామ‌లు ఇలా వినూత్న నిర‌స‌న తెలియ‌జేయ‌డం విశేషం గా మారింది.