గోపీచంద్ `చాణ‌క్య` అక్టోబ‌ర్ 5న

గోపీచంద్, మెహ‌రీన్ జంటగా న‌టిస్తున్న చిత్రం `చాణక్య‌`. బాలీవుడ్ హీరోయిన్ జరీన్‌ఖాన్ ఇందులో నటిస్తోంది . తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ రామ బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ స్పై థ్రిల్ల‌ర్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు చేసుకుంటోంది. అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేస్తున్నారు.
ఈ సినిమా టీజ‌ర్‌, పాట‌లకు మంచి రెస్పాన్స్‌ వచ్చి..సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీత సార‌థ్యం,రైటర్: అబ్బూరి రవి,ఆర్ట్: రమణ వంక,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి,కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు