`ఆంధ్రుడు`, `యజ్ఞం`, `లక్ష్యం`, `శౌర్యం`, `లౌక్యం` వంటి సూపర్‌డూపర్ చిత్రాలతో మెప్పించిన టాలీవుడ్ ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది గోపీచంద్ 25వ చిత్రం కావడం విశేషం. దీనికి `పంతం’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. `ఫర్ ఎ కాస్` ఉపశీర్షిక. `బలుపు`, `పవర్`, `జై లవకుశ` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన కె.చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మే 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా..
నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ – “మా సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌లో గోపీచంద్‌గారి 25వ సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాకు `పంతం` అనే టైటిల్‌ను నిర్ణయించాం. సినిమా అనుకున్న ప్రణాళిక ప్రకారం చిత్రీకరణను జరుపుకుంటుంది. అందులో భాగం ఇప్పటికే ఒక పాట, కొంత టాకీ పార్ట్ పూర్తయ్యింది. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాలను అల్యూనిమియం ఫ్యాక్టరీలో చిత్రీకరించారు . మంచి మెసేజ్‌తో పాటు కమర్షియల్ హంగులతో సినిమాను దర్శకుడు చక్రి చక్కగా తెరకెక్కిస్తున్నారు. హీరో గోపీచంద్‌గారి క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆయన ఎందుకోసం పంతం పట్టాడు. ఆ కారణమేంటనేది తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మే 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం“ అని తెలిపారు.
గోపీచంద్, మెహరీన్, పృథ్వీ, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటించనున్న ఈ చిత్రానికి ఆర్ట్ః ఎ.ఎస్.ప్రకాష్, డైలాగ్స్ః రమేష్ రెడ్డి, స్క్రీన్‌ప్లేః కె.చక్రవర్తి, బాబీ(కె.ఎస్.రవీంద్ర), కో డైరెక్టర్ః బెల్లంకొండ సత్యంబాబు, మ్యూజిక్ః గోపీసుందర్, సినిమాటోగ్రఫీః ప్రసాద్ మూరెళ్ల, నిర్మాతః కె.కె.రాధామోహన్, స్టోరీ, డైరెక్షన్ః కె.చక్రవర్తి(చక్రి).