మంచి కాన్సెప్ట్ తో ‘జాబిల్లి కోసం’ టీజర్ విడుదల

కె యస్ ఆర్ సిల్వర్ స్క్రీన్, ఆర్ ఎక్స్ 100 మరియు  మదర్ మూన్ క్రియేషన్స్ సమర్పణలో వి. జి. ఆర్. ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ప్రిన్స్ ప్రణయ్ (తొలిపరిచయం ), జారాఖాన్  జంటగా బి. వి. గోవింద రాజన్  దర్శకత్వంలో కళ్ళం సుధాకర్ రెడ్డి, , కె. హరి రత్నం లు సంయుక్తంగా  నిర్మిస్తున్న “జాబిల్లి కోసం” చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు  జరుపుకుంటుంది. ఓక చిన్న స్థాయి వ్యక్తి తను ప్రేమించిన జాబిల్లి దూరమైతే ఏం జరిగింది అనేదే ఈ చిత్రం  కథ. ఆగష్టు 15 సందర్బంగా ఈ చిత్రానికి సంబందించిన టీజర్ ను హైదరాబాద్ లో చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిధిగా వచ్చిన ఇక్కుర్తి శ్రీనివాస్ రావు గారు టీజర్ ను లాంచ్ చేశారు.
దర్శకుడు బి. వి. గోవింద రాజన్ మాట్లాడుతూ.. ఒక చిన్న కథని పెద్ద క్వాలిటీతో చేసే  అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదములు. బలవంతమైన సర్పం  చలి చీమల చేతచిక్కి  చావదే.. సుమతీ  అను పద్యమే ఈ సినిమాకు స్ఫూర్తి. ఈ సినిమా కొరకు నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేయడమే కాకుండా ఫుల్ సపోర్ట్ చేశారు అన్నారు.
నిర్మాత కళ్ళం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. శివ నాగేశ్వరావు (శివాజీ ) తయారు చేసిన కథను దర్శకుడు గోవింద రాజన్  హరి రత్నం  కు చెప్పడంతో  తనకీ కథ నచ్చడంతో ..నేను రత్నం కలసిఈ సినిమా చేయడం జరిగింది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా మాకు  మంచి అవార్స్ తీసుకు వస్తుందని నమ్ముతున్నాము .ఇదే బ్యానర్ లో మళ్ళీ మేము చేయబోయే సినిమాకు ఇదే టీం ను  కంటిన్యూ చెయ్యాలనుకుంటున్నాము అని అన్నారు.
మరో నిర్మాత కె. హరి రత్నం మాట్లాడుతూ.. జాబిల్లి కోసం సినిమాను పూర్తిగా డంపింగ్ యార్డ్ లో షూట్ చేయడం జరిగింది. ఈ కథకు చాలా డెప్త్ ఉంటుంది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్నా  ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
కథ, మాటలు అందించిన శివ నాగేశ్వరావు (శివాజీ ) మాట్లాడుతూ..  జాబిల్లి కోసం వంటి మంచి కథను రాసుకున్నాను. రాసుకున్న విధంగానే దర్శకుడు  బి. వి. గోవింద రాజన్ చాలాచక్కగా తెరకెక్కించారు .ఈ చిత్రానికి మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అన్ని వర్గాల  ప్రేక్షకులను ఏర్పాటు సినిమా ఆకట్టుకుంటుందని అన్నారు.
నటీ నటులు 
ప్రిన్స్ ప్రణయ్ (తొలిపరిచయం ), జారాఖాన్, హరి రత్నం, విశ్వనాథ్, రాజు డాన్సర్, రుక్మిణి తదితరులు
సాంకేతిక నిపుణులు 
సమర్పణ : కె యస్ ఆర్ సిల్వర్ స్క్రీన్, ఆర్ ఎక్స్ 100 మరియు  మదర్ మూన్ క్రియేషన్స్
బ్యానర్ : వి. జి. ఆర్. ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : కళ్ళం సుధాకర్ రెడ్డి, బి. వి. గోవింద రాజన్, కె. హరి రత్నం
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : బి. వి. గోవింద రాజన్
కథ, మాటలు : శివ నాగేశ్వరావు (శివాజీ )
సంగీతం : ఎం. ఎల్. రాజు
డి. ఓ. పి : నందన్ కృష్ణన్
ఎడిటర్ : సంపత్ కుమార్
డాన్స్ : బాలు మాస్టర్
పి. ఆర్. ఓ : టి. యన్. యన్. మూర్తి