రజని, శంకర్ ల ‘2.0’ కు భారీ ప్రచారం

శంక‌ర్ తెర‌కెక్కించిన భారీ  ప్రాజెక్ట్ ‘2.0’. ర‌జ‌నీకాంత్ ,అక్ష‌య్ కుమార్, అమీ జాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. రోబో చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి  రిలీజ్ చేయాల‌ని  భావిస్తుండ‌గా, ప్ర‌స్తుతం జోరుగా, కొత్తగా  ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. ‘బాహుబ‌లి’  క‌న్నా భారీ హిట్ సాధించాల‌నే క‌సితో టీం వ‌ర్క్ చేస్తోంది. 400 కోట్ల భారీ బ‌డ్జెట్ చిత్రంగా తెర‌కెక్కిన 2.0 చిత్రం ప్ర‌స్తుతం సీజీ వ‌ర్క్స్ తో పాటు వీఎఫెక్స్ ప‌నులు జ‌రుపు కుంటోంది.

అయితే  ఈచిత్ర ప్ర‌మోష‌న్స్ హాలీవుడ్ స్టైల్ లో  చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. లాస్ ఏంజెల్స్, సాన్ ఫ్రాన్సికో, ఆస్ట్రేలియా, లండ‌న్ , దుబాయ్ ఇత‌ర ప్రాంతాల‌లో చిత్ర ప్ర‌మోష‌న్స్ భారీగా జ‌ర‌పాల‌ని టీం భావిస్తుండ‌గా, తాజాగా వంద అడుగుల హాట్ బెలూన్ ని లాస్ ఏంజెల్స్ లో ఎగ‌రేశారు. టైటిల్ తో పాటు చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ల‌ని బెలూన్ తో హైలైట్ చేస్తున్నారు. అక్టోబ‌ర్ లో చిత్ర ఆడియో వేడుక‌ని దుబాయ్ లో ప్లాన్ చేస్తుండ‌గా, మూవీ జ‌న‌వ‌రి 25, 2018 థియేట‌ర్స్ లోకి రానుంది.