జి.వి.ఆర్ క్రియేటివ్ వర్క్స్’ ప్రీ ప్లాన్డ్’ 24 న విడుదల

జి. వి. ఆర్ క్రియేటివ్ వర్క్స్  యోగి కటిపల్లి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ జి.వెంకట రాజేష్ & శ్రీపతి నాయుడు నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ “ప్రీ ప్లాన్డ్”. రాజ్ కమల్ గుంటుకు, వైష్ణవి సోనీ లు జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 24 న గ్రాండ్ గా విడుదలవుతుంది. ఒక వ్యక్తి ఆలోచన దాని ప్రభావం మరో వ్యక్తి పై ఎలా చూపుతుంది? అనే కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం “ప్రీ ప్లాన్డ్” చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను రచయిత త్యాగరాజు ,ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ సి.ఈ ఓ రాజీవ్ గార్లు ఘనంగా విడుదల చేశారు.

చిత్ర నిర్మాత రాజేష్ మాట్లాడుతూ… ఈ సినిమా దర్శకుడు యోగి కొత్త వాడైనా సినిమా బాగా తీశాడు. మా సినిమాను ఓటిటి లో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చిన ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ సి.ఈ ఓ రాజీవ్ గారికి ధన్యవాదాలు. ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు

చిత్ర దర్శకుడు యోగి మాట్లాడుతూ…  నాకు ఈ కథపై ఉన్న నమ్మకంతో తక్కువ బడ్జెట్ లో నేనే సినిమా తీద్దామని ప్రిపేర్ అయిన టైం లో నిర్మాతలు జి.వెంకట రాజేష్ & శ్రీపతి నాయుడులు ఫోన్ చేసి ఈ సినిమా చేద్దాం అన్నారు. నటీ నటులు అందరూ చాలా సపోర్ట్ చేశారు. లీలు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మందర్ సావంత్  డి. ఓ. పి, సంపత్ కుమార్ ఇలపురం ఎడిటింగ్ ఇలా ప్రతి ఒక్క టెక్నిషియన్స్ అందరూ ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. నిజానికి ఈ రోజు ఒక దర్శకుడిగా ఈ స్టేజ్ పై వున్నాను అంటే.. దానికి నిర్మాతలు జి.వెంకట రాజేష్ & శ్రీపతి నాయుడు లే కారణం. వీరు లేకపోతే నేను లేను. రచయిత త్యాగరాజు గారు ప్రతి విషయంలో నన్ను వెన్ను తట్టి ముందుకు నడిపించారు.వారి సహాయం మరువలేను.మా సినిమాను ఎంకరేజ్ చేస్తూ ఓటిటి లో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చిన ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ సి.ఈ ఓ రాజీవ్ గారికి ధన్యవాదాలు అన్నారు.

ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ సి.ఈ ఓ రాజీవ్  మాట్లాడుతూ… ఈ మూవీ ప్రీమియర్ చూశాను.సినిమా బాగా నచ్చింది. మంచి కంటెంట్ ఉంటే  ప్రేక్షకులే ఆ సినిమా ను పెద్ద సినిమాగా చేస్తారు. ఈ సినిమా బాగా ఉండడంతో నేను ఓటిటి లో రిలీజ్ చేయడానికి సపోర్ట్ చేసాను.ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ లో 20 ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ ఉన్నాయి. వాటిలో మేము ఇప్పటి వరకు 558 సినిమాలను ఓటిటి లో విడుదల చేశాము .ఇప్పుడు రిలీజ్ చేస్తున్న “ప్రీ ప్లాన్డ్” 559 సినిమాఅన్నారు.

రచయిత త్యాగరాజు మాట్లాడుతూ… ఈ మూవీ కొరకు దర్శకుడు యోగి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు . కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేసే ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీ కి రావాలి .ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది .ఈ సినిమాలోని సున్నితమైన భావాలు ప్రేక్షకులను కదిలించేలా చేస్తాయి అన్నారు.

రాజ్ కమల్ గుంటుకు, వైష్ణవి సోనీ, టి. యన్. ఆర్., కవిత శ్రీ రంగం, సత్య ఏలేశ్వరం, శివ, వరహాల బాబు(కాటం రాయుడు), సరస్వతి, కోటి దేవి రెడ్డి, కమల్ దీప్, రాఘవ్ తదితరులు ఇందులో నటీ నటులు.