ఆమెను ‘టైమ్ బాంబ్’ అని పిలుస్తారట !

అందాల తార హన్సికకు తమిళ ఇండస్ట్రీలో మరో పేరు కూడా వచ్చింది. ఆమెను ‘టైమ్ బాంబు’గా అభివర్ణిస్తున్నారు. చిన్న వయసులోనే ‘దేశ ముదురు’ సినిమాలో హీరోయిన్‌గా నటించి తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. కొన్ని సినిమాల తర్వాత ఈ ముద్దుగుమ్మ బరువు పెరిగి… ఆతర్వాత క్రమేణా టాలీవుడ్ నుంచి దూరమైంది. కోలీవుడ్‌లో బొద్దుగుమ్మలకు ఉన్న క్రేజ్ హన్సికకు ప్లస్ అయి అక్కడ అగ్ర నాయికగా రాణించేందుకు తోడ్పడింది. తమిళ ప్రేక్షకులు ఈ భామను ‘చిన్న ఖుష్బూ’గా ఆరాధిస్తున్నారు.కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న హన్సిక  ప్రస్తుతం సినిమాలు తగ్గిపోయి డీలాపడింది.

ఆమెను ‘టైమ్ బాంబు’గా  ఎందుకు అంటున్నారో హన్సికనే స్వయంగా చెప్పింది…. సినిమా షూటింగ్‌లకు తాను కరెక్ట్ టైమ్‌కు వస్తానంటోంది. షూటింగ్ షెడ్యూల్‌కంటే పదినిమిషాల ముందే సెట్స్‌కు వచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తుందట. దీంతో హన్సికను కోలీవుడ్‌లో అందరూ ‘టైమ్ బాంబు’ అని అంటున్నారట. ఇక ట్విట్టర్‌లో తన అభిమానులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటోంది ఈ భామ. తన సినిమాల అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ వారిని పలకరిస్తోంది. అభిమానుల ప్రేమాభిమానాలతోనే కోలీవుడ్‌లో తాను కథానాయికగా అగ్రస్థానానికి చేరుకోగలిగానని హన్సిక చెబుతోంది. తెలుగులో ఇటీవల ‘గౌతమ్‌నంద’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ భామ.