ఇమేజ్ కోసం చీప్ ట్రిక్స్ ప్లే చెయ్యను !

హన్సికా మోత్వాని…  ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన హన్సిక… తన ఫోన్ హ్యాక్ అయినట్లు వివరణ కూడా ఇచ్చింది. అయితే తాజాగా ఈ ఫోటోలపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. కావాలనే పబ్లిసిటీ కోసం హన్సిక తన ఫోటోలను తానే లీక్ చేసుకున్నట్లు ట్రోల్ చేయడంతో ఆమె ఘాటుగా స్పందించారు… లీక్ అయిన ఫోటోలు నిజమైనప్పటికీ అందులో కొన్ని మార్ఫింగ్ చేశారని ఆమె తెలిపింది. గతంలో ఒక ఇన్నర్ వేర్ బ్రాండ్ కోసం బికినీ ఫోటో షూట్ చేయాల్సి వచ్చిందని, ప్రస్తుతం లీక్ అయిన ఫోటోలు అవేనని చెప్పింది. అయితే, లీక్ అయిన వాటిల్లో అన్నీ ఒరిజినల్ కావని.. మార్ఫింగ్ చేశారని హన్సిక వాపోయింది. ఈ ఫోటోలపై వస్తున్న ట్రోలింగ్ పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్లిసిటీ కోసం తన ఫోటోలను తానే లీక్ చేసుకున్నట్లు వస్తున్న కామెంట్స్ పై… ‘నేను లో ‘ప్రొఫైల్ మెయింటేన్ చేసే నటిని’ అని అందరికి తెలుసు. ఇమేజ్ కోసం ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేసే నటిని అయితే కాను. దీనిపై ఎవరి అభిప్రాయాలూ అవసరం లేదంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది’. ఇక లీక్ అయిన ఫోటోల్లో చాలావరకు సోషల్ మీడియా నుంచి డిలిట్ చేసినప్పటికీ కొన్ని ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులో ఉన్నాయి.
 
నా పిల్లల్లో ఒకరు 10వ తరగతి పరీక్షలకు… 
హన్సిక ఇంత చిన్న వయసులోనే 34 మందికి తల్లి అయ్యింది. అవును 34 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తోంది. వారిని హన్సిక తన పిల్లలనే చెబుతుంది. వారి కోసం ముంబైలో ఒక ఆశ్రమాన్ని కట్టించే ప్రయత్నంలో ఉంది. ఈ సందర్భంగా హన్సిక తన ట్విట్టర్‌లో పేర్కొంటూ…  నా పిల్లల్లో ఒకరు ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలను రాయనున్నారని చెప్పింది. అతన్ని మంచి మార్కులు సాధించేలా చేసి రాష్ట్రంలోనే ప్రథమ విద్యార్థిగా తీర్చిదిద్దాలని నూతన సంవత్సరంలో శపథం చేశానని తెలిపింది. ఇకపోతే తాను ప్రస్తుతం నటిస్తున్న ‘మహా’ చిత్రం విభిన్నమైన థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందని చెప్పింది. అయితే ఈ చిత్రం గురించి తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అంది. ఇప్పుడు మరో మూడు కొత్త చిత్రాలను అంగీకరించానని, వాటి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని హన్సిక పేర్కొంది. ఇకపై తాను నటించే చిత్రాల్లో తన పాత్రలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పింది.