మాజీ ప్రేమికులు స్నేహితులుగా ఉండకూడదా?

హన్సిక తమిళ హీరో శింబుల మధ్య సంబంధం గురించి అందరికీ తెలిసిందే. చాలా బాగా ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి అంచుల వరకూ సాగి ఆగిపోయింది .ఇంత కాలం దూరంగా ఉన్న హన్సిక, శింబు ఇటీవల మళ్లీ దగ్గరయ్యారు. మాజీ ప్రియురాలు హన్సిక 50వ చిత్రంలో అతిథిగా నటించడానికి ఎలాంటి అభ్యతరం చెప్పలేదు శింబు. వీరు ఇప్పుడు కలిసి సినిమాలు చేస్తున్నారు. హన్సిక సినిమాలో శింబు గెస్ట్ రోల్ చేశాడు. లాక్‌డౌన్ కారణంగా ఖాళీగా ఉన్న హన్సిక.. తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లోకి వచ్చింది. ఈ సందర్భంగా చాలామంది శింబు గురించే హన్సికను ప్రశ్నించారు… `మాజీ ప్రేమికులు స్నేహితులుగా ఉండకూడదా? మేమిద్దరం ఇప్పుడు మంచి స్నేహితులం.. అంతే` అని సమాధానమిచ్చింది.
 
హన్సిక నటిస్తున్న తాజా చిత్రం ‘మహా’. ఇది ఆమె 50వ చిత్రం. జమీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రారంభమై చాలా కాలమే అయ్యింది. ఆరంభ దశలో హన్సిక దమ్ముకొట్టే ఫొటోలతో కూడిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్లను విడుదల చేసి హడావుడి చేశారు. ఆ తరువాత ఈ చిత్ర నిర్మాణం ఏ స్థాయిలో ఉందో కూడా తెలియని పరిస్థితి. కాగా తాజాగా ఒక ఫొటోను విడుదల చేశారు…అందులో నటి హన్సికపై శింబు పడుకుని కళ్లు మూసుకుని తన్మయత్నంలో ఉన్నట్లు ఉంది. ఈ ఫోటోను దర్శకుడు వెంకట్‌ప్రభు తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తోంది. ఇది ‘మహా’ చిత్రానికి మరోసారి హైప్‌ తీసుకురావడానికి చేసిన ప్రయత్నం అని తెలుస్తోంది. మరోసారి ‘మహా’ చిత్రం వార్తల్లోకి వచ్చింది. శింబు, హన్సికల ఫొటో మహా చిత్రంపై ఆసక్తిని మాత్రం రేకెత్రిస్తోంది. నటుడు శింబు నటించిన చిత్రం విడుదలై కూడా చాలా కాలమైంది. ప్రస్తుతం కొత్తగా నటిస్తున్న చిత్రం కూడా ఏదీ లేదు. త్వరలో వెంకట్‌ప్రభు దర్శకత్వంలో సురేశ్‌కామాక్షి నిర్మించనున్న ‘మానాడు’ చిత్రంలో నటించడానికి శింబు రెడీ అవుతున్నారు. ఈలోగా శింబు తన మాజీ ప్రియురాలు హన్సికతో రొమాన్స్‌ చేసిన ‘మహా’ చిత్రం విడుదలయితే బాగుంటుందనుకుంటున్నారు అభిమానులు.
 
ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలి!
“తమిళ సినిమాలు వరుసగా చేయడంతో తెలుగులో చిన్న గ్యాప్‌ ఏర్పడింది. కానీ, తెలుగు సినిమా అవకాశం ఎప్పుడు వచ్చినా చేస్తుంటాను. పాత్ర బావుంటే భాషతో నాకు పట్టింపు లేదు. ‘నా పాత్రని ఎలా చేశా’ అన్నదే ముఖ్యం. ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నా నేను ఇన్‌సెక్యూర్‌గా ఫీల్‌ అవ్వను… అని అంటోంది హన్సిక. “నేను చాలా కాన్ఫిడెంట్, సెక్యూర్‌ యాక్టర్‌ని.నెగటివ్‌ రోల్, కామెడీ చేయడం చాలా కష్టం. అలాంటి పాత్రలు వస్తే అస్సలు వదులుకోను. కెరీర్‌లో 50 సినిమాలు పూర్తి చేశాను. ‘ఇంకా సాధించాల్సింది చాలా ఉంది’ అని నా భావన. ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలి.. ‘అందరూ బావుండాలి’ అన్నదే నా ఫిలాసఫీ” అని చెప్పింది. 
 
హన్సిక ప్రస్తుతం తెలుగులో అమెజాన్‌ కోసం ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తోంది. ‘భాగమతి’ దర్శకుడు అశోక్‌ డైరెక్టర్‌. షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం యూత్‌ ఎలా ఉంది? అనే యాంగిల్‌లో కథ సాగుతుంది.