హ‌రీష్ వ‌ట్టికూటి `శివ‌కాశీపురం` రెండో పాట‌ విడుదల !

సంగీత ద‌ర్శ‌కులు చ‌క్ర‌వ‌ర్తి మ‌న‌వ‌డు రాజేశ్ శ్రీ చ‌క్ర‌వ‌ర్తి ని క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ సాయి హ‌రేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ పై హ‌రీష్ వ‌ట్టి కూటి ద‌ర్శ‌క‌త్వంలో మోహ‌న్ బాబు పులిమామిడి నిర్మిస్తోన్న చిత్రం `శివ‌కాశీపురం`. ప‌వ‌న్ శేష సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక శర్మ నటించింది . కాగా  ఈ సినిమాలోని రెండో  పాట‌ను శుక్ర‌వారం ఉదయం నేరుగా రిలీజ్ చేసారు .
ఇంతకుముందు  హైద‌రాబాద్ లోని ఎఫ్‌.ఎమ్ స్టేష‌న్ లో తొలిపాటని  రిలీజ్ చేయగా ఇప్పుడు రెండో పాటని రిలీజ్ చేసారు చిత్ర బృందం . ఇక రెండో పాట విశేషం ఏంటంటే …’గానగంధర్వుడు’ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నచ్చి మెచ్చి పాడిన పాట కావడం .  ” అమ్మ అందని త్యాగం , కోటి దైవాల రూపం ” అనే పాట కు బాలు ఆలపించగా పవన్ శేష సంగీతం అందించాడు . అమ్మ లోని గొప్పతనాన్ని ఇప్పటివరకు ఎన్నో పాటల రూపంలో వచ్చింది కానీ ఎన్నో వేల పాటలను పాడిన బాలు మా కథ లోని డెప్త్ ని , పాటలోని ఆంతర్యాన్ని అర్ధం చేసుకొని ఎంతో మక్కువతో పాట పాడటం మాకు గర్వంగా  ఉందని తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు దర్శకులు హరీష్ వట్టికూటి .
ఈసంద‌ర్భంగా చిత్ర నిర్మాత మోహ‌న్ బాబు పులి మామిడి మాట్లాడుతూ, ` బాలసుబ్రహ్మణ్యం కు నేను పెద్ద అభిమానిని , ఆయన పాటలు అంటే నాకు అమితానందం అలాంటి గొప్ప వ్యక్తి నేను నిర్మిస్తున్న మొదటి సినిమాకే పాడటం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది , ఆయన పాడిన అద్భుతమైన పాట ని ఈరోజు ఆదిత్య ద్వారా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది అలాగే చక్రవర్తి మనవడిని చిత్ర పరిశ్రమకు నేను పరిచయం చేస్తున్నందుకు కూడా గర్వంగా ఉంది .
సంగీత ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ శేష మాట్లాడుతూ, ‘గులాబీ’, ‘ల‌వ్ స్టేట్స్’ చిత్రాల‌కు సంగీతం అందించా. ఇది నాకు మూడ‌వ సినిమా. నిర్మాత పులిమామిడి మోహన్ బాబు ఖర్చుకు వెనకాడకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు .  మొత్తం నాలుగు పాట‌లున్నాయి ఈ చిత్రంలో , సంగీతానికి ఎక్కువ స్కోప్ ఉన్న  చిత్రం. ఎస్. పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యంగారు మా సినిమాలో పాడిన అమ్మ పాట సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అన్నారు .
 
చ‌మ్మ‌క్ చంద్ర‌, సూర్య‌, జ‌బ‌ర్ ద‌స్త్ రాము, దిల్ ర‌మేష్‌, న‌వీర్ జ‌బ‌ర్ ద‌స్త్, ల‌క్ష్మీ, ర‌వీంద్ర‌, మాస్ట‌ర్ హ‌రి, హ‌రికృష్ణ పులిమామిడి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : ప‌వ‌న్ శేష‌, కెమెరా :  జి. రామిరెడ్డి, ఎడిటింగ్:  జియోజిథామ‌న్, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: అక్క‌ల చంద్ర‌మౌళి, నిర్మాత మోహ‌న్ బాబు పులిమామిడి, రచ‌న‌, ద‌ర్శ‌క‌త్వం హ‌రీష్ వ‌ట్టికూటి.