హాసిని గాయత్రి క్రియేషన్స్ తొలి చిత్రం ప్రారంభం !

హీరో అభయ్ ,అస్మిత నర్వాల్, గిరిష్మ నేత్రిక హీరో హీరోయిన్స్ గా ,ఆర్ సుమధుర్ కృష్ణ దర్శకత్వంలో పాత్ లోథ్ శంకర్ గౌడ్ లు నిర్మిస్తున్న హాసిని గాయత్రి క్రియేషన్స్  ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ప్రసన్న ఆంజనేయస్వామి గుడిలో జరిగాయి. ముహూర్త‌పు స‌న్నివేశానికి రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్  క్లాప్ కొట్టగా .. ప్రొడ్యూసర్ పాత్ లోథ్ శంకర్ గౌడ్  కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

చిత్ర దర్శకుడు ఆర్ సుమధుర్ కృష్ణ మాట్లాడుతూ…
ఈ సినిమా కథ కొత్తగా ఉండబోతొంది.  కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సస్పెన్సు యాక్షన్ డ్రామా , థ్రిల్లర్ నేపథ్యం లో  ఈ సినిమా  జనవరి 2 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు.
హీరో అభయ్ మాట్లాడుతూ…
డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని  నమ్ముతున్నాను. యంగ్ టీమ్ కలిసి చేస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు. త్వరలో ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారని తెలిపారు.
అస్మిత నర్వాల్ మాట్లాడుతూ…
ఈ సినిమా విజువల్స్ బాగా ఉండబోతున్నాయి. డైరెక్టర్ ఆర్ సమధుర్ కృష్ణ గారు కథ ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో ఉండబోతొంది. నటనకు మంచి స్కోప్ ఉన్న రోల్ లో నేను ఈ సినిమాలో నటించబోతున్నాను అన్నారు.
హీరోయిన్ గిరిష్మ మాట్లాడుతూ…
ఒక మంచి సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. డైరెక్టర్ గారు చెప్పిన కథ బాగుంది. నాకు మీ అందరి సపోర్ట్ కావాలని అన్నారు.

కెమెరామెన్:  ప్రతాప్ కృష్ణన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:
ఆర్ట్ డైరెక్టర్:
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ : ఏ. బాలచంద్ర
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: భాస్కర్ రాజు