హెబ్బా ప‌టేల్ ముఖ్య పాత్ర‌లో `ఒరేయ్ బుజ్జిగా`

శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధా మోహ‌న్ … రాజ్‌త‌రుణ్‌, మాళ‌వికా నాయ‌ర్ తో లక్ష్మీ కె.కె. రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజ‌య్‌కుమార్ దర్శకత్వం లో చేస్తున్న చిత్రం`ఒరేయ్ బుజ్జిగా`. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఇందులో ఓ కీలక పాత్ర‌లో న‌టిస్తున్న హెబ్బా ప‌టేల్ తాజా షెడ్యూల్‌లో యూనిట్‌తో జాయిన్ అయ్యారు. ఆమెపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.
 
కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ.. “ఒరేయ్ బుజ్జిగా` షూటింగ్ ప్లానింగ్ ప్ర‌కారం జ‌రుగుతుంది. రాజ్‌త‌రుణ్ స‌ర‌స‌న మాళ‌వికా నాయ‌ర్ హీరోయిన్‌ అయితే, కీల‌క‌మైన పాత్ర‌లో హెబ్బా ప‌టేల్ న‌టిస్తున్నారు. మాళ‌వికా, హెబ్బా ప‌టేల్ ఇద్ద‌రి పాత్ర‌ల‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ద‌ర్శ‌కుడు కొండా విజ‌య్‌కుమార్ తెర‌కెక్కిస్తున్నారు“ అన్నారు.
 
వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ నటీనటులు . సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌
 
Hebah Patel In ‘Orey… Bujjiga’
KK Radhamohan under his Sri SathyaSai Arts banner producing ‘Orey… Bujjiga’ with Raj Tarun, Malavika Nair .Konda Vijaykumar Directing this film. ‘Kumari 21F’ fame Hebah Patel in a crucial role in this film. Hebah Patel has joined the unit .
 
” in ‘Orey… Bujjiga Malavika Nair is playing as heroine with Raj Tarun.Hebah Patel is doing a crucial role in this film. Malavika and Hebah Patel have importance roles in the story. Director Konda Vijaykumar is handling this project in an entertaining manner ” …Producer KK Radhamohan said
 
Vani Viswanath, Naresh, Posani Krishna Murali, Aneesh Kuruvilla, Sapthagiri, Raja Raveendra, Ajay Ghosh, Annapurna, Siri, Jayalakshmi, Soniya Chowdary, Sathya, Madhunandan is the cast. Music: Anup Rubens, Dialogues: Nandyala Ravi, Cinematography: I Andrew, Editing: Praveen, Dance: Sekhar, Art: T.Rajkumar, Fights: Real Satish