‘ఏంజెల్’ను చాలా రెస్పాన్స్ బులిటీ ఫీలయ్యి చేసా !

శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ ‘ఏంజెల్’. సోషియో ఫాంటసీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకి రాజమౌళి శిష్యుడు ‘బాహుబలి’ పళని దర్శకుడు. ప్రముఖ నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి.  ఈ చిత్రం నవంబర్ 3న విడుదలవుతున్న నేపథ్యంలో హీరోయిన్ హెబ్బా పటేల్ విలేకరులతో ముచ్చటిస్తూ… ఏంజిల్ సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ స్టోరీ. ఈ చిత్రం నవంబర్ 3న విడుదలవుతోంది. గ్రీన్ మ్యాట్ లో చేసిన  షూట్ ను నేను బాగా ఎంజాయ్ చేసి నటించాను. 45 నిమిషాలకు పైగా సీజీ సీన్స్ ఉండడంతో దాదాపు నాలుగు నెలలు కష్టపడి పని చేశారు సినిమా యూనిట్. ‘కుమారి 21ఎఫ్’ సినిమా తరువాత మరోసారి ఏంజిల్ టైటిల్ రోల్ లో నటిస్తున్నందుకు హ్యాపీగా ఉన్నాను. ఈ చిత్రంలో నా పాత్ర ఏంజిల్. అందరూ  అలానే పిలుస్తుంటారు. దివి నుంచి దిగివచ్చిన నాకు, హీరో కు, సప్తగిరికి మధ్య పరిచయం ఎలా అవుతుంది? దివి నుంచి దిగికు ఎలా వచ్చాను? ఆ తరువాత ఏం జరిగిందనేదే చిత్ర కథాంశం.

ఇంతకు ముందు నా సినిమాల కంటే  ఈ చిత్రంపై చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాను. అంతే నెర్వస్ గా  కూడా ఫీల్ అవుతున్నాను. ఈ కథ ఎంచుకోవడానికి మాత్రం సినిమా కంటెంటే ముఖ్య కారణం. స్టోరీ లైన్ బాగా నచ్చింది. డైరెక్టర్ పలణి  గారు అద్భుతంగా కథను నెరేట్ చేయడమే కాకుండా, గ్రాఫిక్స్ కూడా అంతే అద్భుతంగా ప్రెజెంట్ చేశారు.  డిఫరెంట్ జోనర్ లో నటించడం మొదటి సారి కనుకే ఏంజిల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను.   నా పాత్ర లో  చాలా వేరియేషన్స్ కనపడతాయి.    చెప్పాలంటే… ఈ  సినిమాను చాలా రెస్పాన్స్బిలిటీ గా ఫీల్ అయ్యి… నా భుజస్కంధాల పై  వేసుకొని నటించానని  చెప్పొచ్చు.  హీరో అన్వేష్ కొత్త అయినా, చాలా హార్డ్ వర్కర్. డాన్స్, ఫైట్స్, యాక్టింగ్  చాలా బాగా చేశారు. మంచి హీరో అవడానికి ఆస్కారమున్న వ్యక్తి. ఈ ఏంజిల్ సినిమా తో ప్రూవ్ చేసుకోవాలని తపించాడు. తప్పకుండా బిగ్ హీరో అవుతారు అన్వేష్.  ఇక నా విషయానికి వస్తే ఒకటిన్నర సంవత్సరం నుంచి వరుస సినిమాలతో షూటింగ్స్ తో బిజీ గా గడిపాను. అందుకే కొంత కాలం గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ముంబయ్ లో ఇల్లు కొన్నాం.  వాటి పనులు చూస్తూ అక్కడే కొంత రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. సినిమా బిజీ లో పడి  నేను నా గురించి పట్టించుకోవడం మానేశా. అందుకే ‘రెస్ట్ కావాలి’ అనుకుంటున్నాను. చిన్న గ్యాప్ కోసమే. ప్రస్తుతానికి ఏ సినిమాలను అంగీకరించడం లేదు అని అన్నారు హెబ్బా…