హరనాథ్ పోలిచర్ల రచన, దర్శకత్వం, నిర్మాణంలో “నా తెలుగోడు”
డ్రీమ్ టీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హరనాథ్ పోలిచర్ల రచన, దర్శకత్వం, నిర్మాణంలో తయారైన ‘నా తెలుగోడు’ సినిమా డిసెంబర్ 12వ తేదీన విడుదల కానుంది. హరనాథ్ పోలిచర్ల హీరోగా, దర్శక నిర్మాతగా రానున్న ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, రఘు బాబు, జరీనా వహాబ్, నైరా పాల్, రోనీ కౌలా, సుఫియా తన్వీర్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. మల్లి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించగా, శివ సంగీతం సమకూర్చారు. రమణ ఎడిటింగ్ చేయగా, చంద్ర బోస్, గడ్డం వీరు పాటలు రచించారు. ఈ చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
దర్శకుడు స్వరూప్ మాట్లాడుతూ… “హరనాథ్ గారు అమెరికాలో ఉంటూ సినిమాల పట్ల ఉన్న అభిమానంతో ఎంతో కష్టపడి ఎంత దూరం వచ్చి సినిమాలు చేయడం అనేది ప్రశంసించదగ్గ విషయం. “నా తెలుగోడు” సినిమా టైటిల్ చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. చిత్ర టైలర్ చూస్తుంటే సినిమా సమాజం పట్ల ఎంతో బాధ్యతతో డ్రగ్స్ పట్ల పోరాడుతూ తీసిన సినిమాల తెలుస్తుంది. డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అంతా థియేటర్లో చూసి ఆశీర్వదించవలసిన కోరుకుంటున్నాను. చిత్ర బంధానికి కంగ్రాట్స్” అన్నారు.
దర్శకుడు మహేష్ మాట్లాడుతూ… “హరనాథ్ గారి సినిమాలు మనం ముందుండి చూస్తూనే ఉన్నాము. ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఎంతో ప్యాషన్ తో ఆయన సినిమాలు చేస్తున్నారు. డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను ” అన్నారు.
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ… “సినిమాలను ఎప్పుడూ ముందుండి ప్రోత్సహించిన నవీన్ గారు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు మంచి సినిమా అని అర్థమైంది. హరనాథ్ గారు ఎంతో ప్యాషన్ తో ఇక్కడ సినిమాలు చేస్తూ ఎంతో మందికి అవకాశం ఇస్తున్నారు. నా తెలుగోడు టైటిల్ చూస్తే చాలా ప్రత్యేకంగా ఉంది. ప్రభుత్వ మారు చెప్పినట్లు ప్రజలకు డ్రగ్స్ పట్ల ఎంతో అవగాహన ఉండేవిధంగా ఇటువంటి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం అనేది హర్షించదగిన విషయం. సంగీతం చాలా అద్భుతంగా అనిపించింది. చిత్ర బంధం అందరికీ ఆల్ ద బెస్ట్. డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రారన్న ఈ చిత్రం మంచి విజయం సాధించి హరినాథ్ గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
మైత్రి నవీన్ మాట్లాడుతూ… “గత 25 ఏళ్లగా హరనాథ్ గారు నాకు పరిచయం. సాధారణంగా అంత బిజీగా ఉండే ఒక వ్యక్తి సంవత్సరానికి ఒక సినిమా తీయడం అనేది చాలా కష్టమైన పని కానీ ఆయనకు ఉన్న ప్యాషన్ తో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే 15 సినిమాలు చేశారు. ఆయనకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. ఎంతో జ్ఞానం ఉన్న వ్యక్తి. ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీన మంచిగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
దర్శకుడు మహేష్ బాబు మాట్లాడుతూ… “హరనాథ్ గారు గురించి తెలుసుకుంటుంటే చాలా ఆశ్చర్యం వేసింది. అమెరికాలో ఒక పెద్ద డాక్టర్ అయ్యి ఉండి కూడా ఆయన ప్యాషన్ తో ఇక్కడ సినిమాలు తీయడం ఎంతో మందిడి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. డిసెంబర్ 12వ తేదీన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
చిత్ర హీరో, నిర్మాత, దర్శకుడు హరనాథ్ పోలిచెర్ల మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాతో కలిసి ఈ సినిమా కోసం పని చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను సినిమాలు చేయడానికి ముఖ్య కారణం అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన పాటలు నన్ను ఎంతగానో ప్రేరేపించాయి. దేశం మీద ఉన్న ప్రేమతో ఇక్కడ హాస్పిటల్స్ లో సేవ చేసి సినిమాలు మొదలుపెట్టాను. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేశాను. ఎన్నో విషయాలు సమాజానికి ఉపయోగపడే విధంగా ఏదోక విషయం చెప్పుకుంటూ వచ్చాను. ఆ సినిమాలకు మంచి అవార్డ్స్ కూడా వచ్చాయి. ఒక సినిమాకు రామానాయుడు గారు, ఒక సినిమాకి చిరంజీవి గారి దగ్గర నుండి ప్రోత్సాహం లభించింది. సమాజంలోని వివిధ అంశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చేలా సినిమాలు చేస్తూ వచ్చాను.
ఈ సినిమా “నా తెలుగోడు” విషయానికి వస్తే రామారావు గారు నాకు దైవ సమానులు. ఆయన ఆశీర్వాదంతో ఈ సినిమా చేశాను. తెలుగోడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఎలా మంచి కోసం పోరాడేవాడు, ప్రతిభావంతుడు, కష్టపడేవాడు అనేది చూపించాను. ఈ సినిమాలో ప్రత్యేకంగా నాలుగు అంశాలను చూస్తాము. అమ్మ గురించి, డ్రగ్స్ పై అవగాహన, సైనికుడు జీవితం గురించి, బాల శిశువులను కాపాడే ప్రయాణం పై ఈ సినిమాలో చూడబోతున్నాము. ఈ అంశాలు అన్నింటినీ ప్రేక్షకులకు అర్థం అయ్యే విధంగా ఈ సినిమాలో చూస్తాము. ఈ సినిమా కోసం నా చిత్ర బృందం అందరూ నాకు ఎంతో అండగా నిలబడ్డారు. శివ మంచి సంగీతాన్ని అందించారు. ప్రేక్షకులు అందరూ డిసెంబర్ 12వ తేదీన సినిమాను చూసి, సినిమాలోని అంశాలను మీ మనసులోకి తీసుకుంటారు అని కోరుకుంటున్నాను” అంటూ ముగించారు.

















