ఈ సినిమాపై భారీ అంచనాలు, బిజినెస్ !

పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ ఆర్.ఎఫ్.సిలో జరుగుతోంది. తాజా షెడ్యూల్ పూర్తవగానే.. యూరప్ వెళ్లబోతోందట చిత్రయూనిట్. సుమారు 20 రోజుల పాటు యూరప్ లోనే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ జరగనుంది. జులై 19న యూరప్ కు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలను, ఓ ఛేజింగ్ సీన్ కు అక్కడ చిత్రీకరించబోతున్నారట. బల్గేరియాలో పాటల చిత్రీకరణ జరగనుందట.హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కు జంటగా కీర్తీ సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాతో టాలీవుడ్ కు వస్తున్నాడు.
ఇదిలా ఉంటే… ఇంకా ఫస్ట్ లుక్ కూడా విడుదల కాకముందే బిజినెస్ విషయంలో దుమ్మురేపుతోంది పవన్ కొత్త సినిమా.  సీడెడ్ లో ఈ సినిమా 16 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. “బాహుబలి-2” తర్వాత ఈ స్థాయి రేటుకు అమ్ముడైన మూవీ ఇదే కావడం విశేషం. పవన్ గత చిత్రాలు ప్లాప్ అయినప్పటికీ.. గతంలో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి..!