నాలుగు రోజుల్లోనే అందరినీ దాటేసింది !

‘ఐటీ’ అంతగా అంచనాలు లేకుండా హాలీవుడ్‌లో రిలీజైన ఓ హార్రర్‌ చిత్రం.’ఐటీ’  ఇప్పుడు హాలీవుడ్‌లో కొత్త థ్రిల్ల‌ర్‌. నేటితో ఈ చిత్రం విడుదలై ఐదు రోజులు అవుతోంది. బాహుబలి, దంగల్‌ సినిమాల రికార్డు కలెక్షన్లను నాలుగు రోజుల్లో దాటేసింది. ఇప్పటివరకూ హాలీవుడ్‌ అద్భుత హార్రర్‌ చిత్రాల్లో ‘ఐటీ’ ముందు వరుసలో ఉంటుందని సినీ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.1986లో విడుదలైన ‘ఐటీ’ పుస్తకం ఆధారంగా స్టోరీ లైన్‌ను తీసుకుని తక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఐటీ పుస్తకాన్ని రాసింది స్టీఫెన్‌ కింగ్‌.. కాగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ఆండ్రెస్‌.

అమెరికాతో పాటు ప్ర‌పంచ దేశాల్లోనూ ‘ఐటీ’  ఫిల్మ్ హార‌ర్ ప్రేక్ష‌కుల‌ను అట్రాక్ట్ చేస్తున్న‌ది.హర్రర్‌ చిత్రాల ప్రేమికులకు ఈ సినిమా కనువిందు అనే టాక్‌ కూడా ఉంది.  కేవ‌లం ఓపెనింగ్ వీకెండ్‌లోనే ‘ఐటీ’ ఫిల్మ్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1200 కోట్ల వ‌సూల్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే ఫిల్మ్ అమెరికా వీకెండ్‌లో సుమారు 750 కోట్లు వ‌సూల్ చేసింద‌ట‌. ఇది హాలీవుడ్ హార్రర్‌  ఫిల్మ్ హిస్ట‌రీలో కొత్త రికార్డు. ఇటీవ‌ల విడుద‌లైన అన్ని హాలీవుడ్ రికార్డ్స్‌ను బ్రేక్ చేసిందీ ఇట్‌. అంతలా ఈ చిత్రంలో ఏం ఉంది మరి?పెద్ద హీరో పాత్ర‌లు లేకుండానే సాగిన పిల్ల‌ల సినిమా ఇది. నిజానికి పెద్ద‌గా హార‌ర్ స‌న్నివేశాలు లేకున్నా.. అంద‌ర్నీ ఆకట్టుకుంటోంది. రోటెన్ ట‌మోటాస్ సంస్థ ఈ ఫిల్మ్‌కు త‌న రివ్వ్యూలో 86 శాతం క్రెడిట్ ఇచ్చింది. అమెరికా వీకెండ్‌లో 123 మిలియ‌న్ల డాల‌ర్లు వ‌సూల్ చేసిన  ‘ఐటీ’ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తున్న‌ది. అంతేకాదు ఇటీవ‌ల హార్రర్‌  స‌బ్జెక్ట్‌తో వ‌స్తున్న చిత్రాల్లో ఇది ఒక్క‌టే భారీ స‌క్సెస్ కొట్టింది. వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్‌, న్యూ లైన్ సినిమా సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మించాయి. అమెరికాను ఇటీవ‌ల రెండు హ‌రికేన్లు దెబ్బ‌తీసినా.. ‘ఐటీ’ మాత్రం ఆ దేశ బాక్సాఫీస్ వ‌ద్ద క‌న‌క‌వ‌ర్షం కురిపిస్తున్న‌ది.