హోమానంద్, పావని నాయకానాయకలుగా నటిస్తోన్న చిత్రం `మిస్టర్ హోమానంద్`. జై రామ్ కుమార్ దర్శకత్వంలో ఓంతీర్థం ఫిల్మ్ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఉదయం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ముందుగా ట్రైలర్ ను, బిగ్ సీడీని తెలంగాణ రాష్ర్ట రవాణా శాఖ మంత్రి పట్నం మహీందర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సీడీలను నిర్మాత మల్కాపురం శివకుమార్ ఆవిష్కరిచి తొలి ప్రతిని మహీందర్ రెడ్డికి అందించారు.
అనంతరం మంత్రి మహీందర్ రెడ్డి మాట్లాడుతూ, `సినిమా బాగుంటుందని ఆశిస్తున్నా. రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలు సినిమాను ఆదరించాలని కోరకుంటున్నా. కొత్త వాళ్లు అయినప్పటికీ అంతా బాగా నటించారు. ట్రైలర్ చాలా బాగుంది. పాటలు, సినిమా పెద్ద విజయం సాధించి టీమ్ అందరికీ మంచి పేరు రావాలి` అని అన్నారు.
హీరో హోమానంద్ మాట్లాడుతూ, ` హీరోగా నాకిది తొలి సినిమా. ఎలా నటించాలో తెలియక కొంచెం టెన్షన్ పడ్డా. కానీ నా నటన చూసి సీనియర్ యాక్టర్ లా చేసేవని అంతా అంటుంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాను. నన్ను తెలుగు ప్రేక్షకులంతా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా` అని అన్నారు.
ఎగ్జిక్యుటివ్ నిర్మాత ఎం. ఇంద్రసేనా రెడ్డి మాట్లాడుతూ, `మా గురువు గారు కేశవ తీర్థ గారి వల్లే సినిమాల్లోకి రావడం జరిగింది. ఆయనతో ఎనిమిదేళ్ల నుంచి ట్రెవెల్ అవుతున్నా. హేమానంద్ సినిమాకు ముందు ఒళ్లు చేసి ఉండేవాడు. కేవలం సినిమాల మీద ఫ్యాషన్ తో బరువు తగ్గి స్లిమ్ అయ్యాడు. తన డెడికేషన్ చాలా నచ్చింది. సెట్స్ లో చక్కగా నటించాడు. సింగిల్ టేక్ లోనే సీన్ ఒకే అయిదేంటే అతను ఎంత చక్కగా నటించాడో అర్ధం చేసుకోవచ్చు. సినిమా అనుకున్న టైమ్ లోనే పూర్తిచేయగలిగాం. మంచి అవుట్ ఫుట్ వచ్చింది. సినిమా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది` అని అన్నారు.
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ, ` వర్షాకాలంలో భయపెట్టే మూవీ ఇది. ట్రైలర్ చాలా బాగుంది. ఇలాంటి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు సక్సెస్ అయితే ఎంతో మంది కొత్త ట్యాలెంట్ వస్తుంది` అని అన్నారు.
దర్శకుడు జైరామ్ కుమార్ మాట్లాడుతూ, ` కామెడీ, హారర్ జోనర్ సినిమా ఇది. ఇలాంటి పాయింట్స్ తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ మా సినిమా వాటికి భిన్నంగా కొత్తగా ఉంటుంది. హీరో కొత్త వారు అయినప్పటికి చాలా బాగా నటించాడు. నిర్మాత నేను అడిగిందల్లా ఏర్పాటు చేయడంతోనే మంచి అవుట్ ఫుట్ ఇవ్వగలిగాను. సినిమా అన్ని వర్గాల వారికి బాగా నచ్చుతుంది` అని అన్నారు.
సంగీత దర్శకుడు బోలేషావళి మాట్లాడుతూ, ` నా గత సినిమాల్లో పాటలకంటే ఇందులో బాగా కుదిరాయి. పెద్ద హిట్ అవుతాయని నమ్మకం ఉంది. ఇటీవల తెలంగాణ సాంగ్ ఒకటి చేసాను. దానికి మంచి పేరు వచ్చింది. అంతకు మించిన పేరు ప్రఖ్యాతలు ఈ సినిమా ద్వారా వస్తాయి` అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజా వన్నెంరెడ్డి, పావని, మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రియాంక శర్మ, సుమన్, ప్రభాకర్, రఘు కారుమంచి, గుండు హనుమంతరావు,హరి, కృష్ణ శ్రీ, చిట్టిబాబు, వివేక్, నాగిరెడ్డి, రాజేంద్ర తిరుపతి దొరై, నామాల మూర్తి, చంద్రమౌళి, ఇంద్రసేనారెడ్డి, శివస్వామి, తడివేలు, గుండు మురళి, ఆనంద్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యుటివ నిర్మాత: ఎం.ఇంద్ర సేనారెడ్డి, కథ, మాటలు: శ‌్రీహరి చీమలమర్రి, సంగీతం: బోలేషావళి, ఎడిటింగ్: క‌్రాంతి, ఆర్ట్: విజయ కృష్ణ, ఫైట్స్: రవి, కొరయోగ్రఫీ: చంద్ర కిరణ్, విఘ్నేష్. స్టిల్స్: సుబ్బారెడ్డి, గ్రాపిక్స్ : అనిల్.