దెయ్యంతో `మిస్ట‌ర్ హోమానంద్` ఫైట్

హోమానంద్, పావ‌ని నాయ‌కానాయ‌క‌లుగా న‌టిస్తోన్న చిత్రం `మిస్ట‌ర్ హోమానంద్`. జై రామ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓంతీర్థం ఫిల్మ్ మేక‌ర్స్ నిర్మిస్తోంది. అన్ని ప‌నులు పూర్తి చేసుకుని ఈనెల 29న సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా …
 హీరో హోమానంద్ పాత్రికేయుల‌తో మాట్లాడుతూ…`మా నాన్న గారు కేశ‌వ తీర్ధ‌. సినిమా నిర్మాత . ఆయ‌న గ‌తంలో `బైజ‌వాడ పోలీస్ స్టేష‌న్`తో పాటు మ‌రో సినిమా చేసారు. ఆయ‌న స్ఫూర్తితోనే నేను సినిమాల్లోకి వ‌చ్చాను. ముందు ల‌ఘు చిత్రాల్లో న‌టించాల‌నుకున్నా. కానీ ల‌క్కీగా సినిమాలోనే అవ‌కాశం రావ‌డంతో న‌టించేసా. స‌త్యంగారి వ‌ద్ద‌ యాక్టింగ్  శిక్ష‌ణ తీసుకున్నా.  ఆయ‌న చెప్పిన మెల‌కువ‌లు బాగుంటాయి. సెట్స్ లో ఆ ఎక్స్ పీరియ‌న్స్  బాగా ప‌నికొచ్చింది. పావ‌ని న‌టిగా సీనియ‌ర్. ఆమెతో పోటీ ప‌డి నటించ‌గ‌లిగా. మంచి కోస్టార్. ఇందులో నాది పిసినారి పాత్ర‌. పొగేసిన డ‌బ్బుతో ఓ ఇల్లు కొంటా. అందులో ఓ దెయ్యం ఉంటుంది. క‌ష్ట‌ప‌డి కొనుక్కున్న ఇంట్లో దెయ్యం ఏంటని…  దానితో నేను చేసే ఫైట్. సింపుల్ గా సినిమా క‌థ ఇదే.
హార‌ర్ కామెడీ జోర‌ర్ లో ఉంటుంది. సినిమా ఆద్యంతం న‌వ్విస్తుంది. కామెడీకి పెద్ద పీట వేసి తీసాం. హీరోయిన్ తో కొన్ని స‌న్నివేశాలు  ఉన్న‌ప్ప‌టికీ అవి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి. డైరెక్ట‌ర్ చిన్న‌ప్ప‌టి నుంచి తెలుసు. మంచి చ‌నువు ఉంది. క‌థ చెప్ప‌గానే చాలా కొత్త‌గా ఉంది అనిపించింది. మా ఫ్యామిలీకి కూడా క‌థ బాగా న‌చ్చింది. దీంతో వెంట‌నే ఓకే చెప్పేశా. డైరెక్ట‌ర్  సినిమా  బాగా తెర‌కెక్కించారు. సినిమా అంద‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. సుకుమార్, మారుతి ప్రొడ‌క్ష‌న్ లో న‌టించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం ఆ ప‌నులు డిస్క‌ష‌న్ స్టేజ్ లో ఉన్నాయి. రాజా వ‌న్నెంరెడ్డిగారితో కూడా సినిమా ఉంటుంది. ఆ ప‌నులన్నీ నాన్న గారు చూసుకుంటున్నారు. నేను అభిమానించే హీరో ఉపేంద్ర‌. ఆయ‌న ఎంచుకునే క‌థ‌లు బాగుంటాయి.యాక్టింగ్ కూడా కొత్త‌గా ఉంటుంది. నా ఎడ్యుకేష‌న్ ఇటీవ‌లే బిబిఏ పూర్తిచేసాను` అని తెలిపారు.