స్టార్స్‌కు చాలా అభద్రతా భావం ఉంటుంది!

హృతిక్‌ రోషన్‌ ‘సూపర్‌ 30’ సక్సెస్‌తో సూపర్‌ ఎనర్జీలో ఉన్నాడు. సిద్ధార్థ్‌ ఆనంద దర్శకత్వంలో రూపొందిన ‘వార్‌’ చిత్రం కోసం చాలా ఫిట్‌గా తయ్యారయ్యాడు. “కథలో దమ్ముంటేనే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అయినా బాక్సాఫీస్‌ నిలబడుతుందని “… చెబుతున్నాడు హృతిక్‌.”యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌ అనేది నా ఫేవరెట్‌ జోనర్‌. అటువంటి సినిమాలు చేసే అవకాశం చాలా తక్కువగా వచ్చింది. వాటికి మంచి కథలు రావడం చాలా కష్టం. ఈ జోనర్‌కి ఇంటిలిజెంట్‌ స్క్రిప్ట్‌ కావాలి” అని చెప్పారు.
వార్‌‘ లాంటి మల్టీ స్టార్ సినిమాలు నమ్మదగిన వాళ్లతోనూ… తమ స్టార్‌డమ్‌కు ఇబ్బంది లేదనుకునే హీరోలతోనూ చేయాలి. మన సినిమా రంగంలో స్టార్స్‌కు చాలా అభదత్రా భావం ఉంటుంది. ఒకరినొకరు నమ్మలేని పరిస్థితి. ‘వార్‌’ సినిమా విషయంలో ఆ ఇబ్బంది లేదు. మేమంతా కలసి మంచి సినిమా చెయ్యాలనుకుని … టైగర్‌ ష్రాఫ్‌, నేను దర్శకుడ్ని నమ్మాం. బాగా రావాలని ఎవరికి వారు తీవ్రంగా కృషి చేశాం” అని చెప్పాడు.
 
సూపర్‌ 30‘ కోసం హృతిక్‌ రోషన్‌ ఓ బాడీ లాంగ్వేజ్‌లో ఉన్నాడు. ‘వార్‌’ చిత్రానికి చాలా ఫిట్‌గా మారిపోయాడు… “ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కోసం ‘వార్‌’ నిర్మాతలు రెండు నెలలు సమయం ఇచ్చారు. చాలా కష్టతరమైన ట్రాన్ఫ్సర్మేషన్‌ చేశాను.నేను ఇలా మారడానికి చేసిన ఎక్లర్ సైజుల మొత్తాన్ని షూట్‌ చేశాను. అదొక సినిమాయే” అని అన్నాడు
 
అమితాబ్‌ పాత్రలో హృతిక్‌
హృతిక్‌ నెక్ట్స్‌ సినిమా ఏంటి? అనే ప్రశ్న బీటౌన్‌లో మొదలైంది. 1982లో అమితాబ్‌ బచ్చన్, హేమ మాలిని నటించిన యాక్షన్‌ కామెడీ చిత్రం ‘సత్తే పే సత్తా’ (1982) రీమేక్‌లో హృతిక్‌ రోషన్‌ నటించబోతున్నారట. ఈ సినిమాకు ఫర్హాన్ ఖాన్‌ దర్శకత్వం వహిస్తారు.. దర్శకుడు రోహిత్‌ శెట్టి ఈ సినిమాను నిర్మిస్తారట. ఆసక్తికరమైన విషయం ఏంటంటే… ఈ సినిమాలో హృతిక్‌ సరసన దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తోందట ..
‘రామాయణ్‌’ లో శ్రీరాముడు
హృతిక్‌ రోషన్‌ ఇప్పుడు వరుసగా సినిమాలను సైన్‌ చేస్తున్నారు. ఫర్హాన్‌ ఖాన్‌తో ‘సత్తే పే సత్తా’, ఆ తర్వాత ‘క్రిష్‌ 4’ ఉంటుందని ప్రకటించారు. తాజాగా అల్లు అరవింద్, నమిత్‌ మల్హోత్రా నిర్మాణంలో తెరకెక్కనున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ్‌’ లో హృతిక్‌ హీరోగా నటించనున్నారని టాక్‌. ఇందులో శ్రీరాముడిగా హృతిక్‌ నటించనున్నారట. లైవ్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కబోయే ఈ సినిమాకు ‘దంగల్‌’ ఫేమ్‌ నితేష్‌ తివారి, ‘మామ్‌’ దర్శకుడు రవి ఉడయార్‌ దర్శకత్వం వహించనున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూడు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రం బడ్జెట్‌ సుమారు 1500 కోట్లు.