వెండితెరపై శివుడిగా హృతిక్‌

బాలీవుడ్‌ కథానాయకుడు హృతిక్‌ రోషన్‌ శివుడిగా వెండితెరపై ప్రత్యక్షం కాబోతున్నారు. ప్రముఖ రచయిత అమీష్‌ త్రిపాఠి రాసిన ‘ది ఇమ్మోర్టల్స్‌ ఆఫ్‌ మెలూహ’ అనే నవల ఆధారంగా తెరకెక్కించబోయే చిత్రంలో హృతిక్‌ భోళాశంకరుడి అవతారం ఎత్తనున్నాడట. ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్‌పై సంజయ్ లీలా భన్సాలీ రూపొందించబోతున్నారు.
అయితే గతేడాది ఇదే నవల ఆధారంగా నిర్మాత కరణ్‌ జోహర్‌ ‘శుద్ధి’ పేరుతో ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేశారు. సల్మాన్‌ ఖాన్‌, వరుణ్‌ ధావన్‌, అలియా భట్‌ ప్రధాన తారాగణంగా ఈ సినిమా చేయాలనుకున్నారు. కానీ అది వర్కౌట్‌ కాలేదు. దీంతో ఆ పుస్తకం రైట్స్‌ను తాజాగా సంజయ్ లీలా భన్సాలీ దక్కించుకున్నారు.