మళ్ళీపెళ్లి చేసుకుంటున్న విడిపోయిన జంట?

బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో హృతిక్ రోషన్, భార్య సుసాన్నే ఖాన్‌తో విడిపోయిన విషయం విదితమే. భార్యతో విడిపోయిన ఈ స్టార్ హీరో మళ్లీ పెళ్లికి సిద్ధమవుతున్నాడు. అయితే వేరొక మహిళను పెళ్లాడటం లేదులెండి. విడిపోయిన తన భార్యనే మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడని సినీ వర్గాల్లో టాక్.  హృతిక్ రోషన్,  సుసాన్నే విడిపోయినా, పిల్లల విషయంలో కలిసే అన్ని నిర్ణయాలూ తీసుకుంటారు. వీరికి ఇద్దరు మగపిల్లలు. ఈ పిల్లల కోసం వీరిద్దరూ అప్పుడప్పుడూ కలుస్తూనే ఉంటారు. దీంతో వారి మధ్య విభేదాలు తొలిగిపోయాయని.. వారిద్దరూ ఒక్కటి కానున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం.
 అంతేకాకుండా, హృతిక్‌కు సుసాన్నే చెప్పిన బర్త్ డే విషెస్, కంగనా వివాదం లో  తన మాజీ భర్తకు సపోర్ట్ ఇవ్వడం లాంటివి చూస్తే… వీరిద్దరూ ఒక్కటవుతారన్న సంకేతం కనిపిస్తోంది  హృతిక్‌ బర్త్ డే సందర్భంగా సుసాన్నే “ఎప్పటికీ తన జీవితంలో హృతికే సన్‌షైన్ అనీ.. ఆయనెప్పుడూ నవ్వుతూ ఉండాల”ని ట్వీట్ చేయడమే కాకుండా స్వయంగా బర్త్ డే పార్టీకి వెళ్లి హృతిక్‌ని విష్ చేసింది. ఇవన్నీ వీరిద్దరూ కలవడానికి సంకేతాలని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.