ప్ర‌పంచంలోనే అంద‌మైన హీరో హృతిక్‌

`ఆసియ‌న్ సెక్సీయెస్ట్ మ్యాన్‌`, `మ్యాన్ ఆఫ్ ది ప్లానెట్` అవార్డుల‌ను ఇప్ప‌టికే ద‌క్కించుకున్న హృతిక్‌ రోషన్‌ ఇప్పుడు ప్ర‌పంచంలోనే అంద‌మైన హీరోగా  రికార్డుకెక్కాడు. హాలీవుడ్‌ నటులు రాబర్ట్‌ పాటిసన్‌, తైవాన్‌ నటుడు గాడ్‌ఫ్రీ, క్రైస్‌ ఈవాన్స్‌, డేవిడ్‌ బోరీయన్జ్‌ వంటి స్టార్స్‌ అంతా హృతిక్‌ తర్వాత స్థానంలోనే ఉన్నారు. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ కూడా ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. నటుల లుక్స్‌, ప్రపంచ వ్యాప్తంగా ఆయనకున్న అభిమానులు, ఈ హీరో చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద చేసే కలెక్షన్లు, ప్రకటనలు వీటన్నింటి ఆధారంగా వరల్డ్‌ ‘టాప్‌మోస్ట్‌. కామ్‌’ అనే వెబ్‌సైట్‌ ఈ జాబితాను రూపొందించింది.  ఈ జాబితాలో హాలీవుడ్‌ స్టార్‌హీరో రాబర్ట్‌ పాట్సిన్‌ రెండో స్థానంలోనూ గాడ్‌ఫ్రీ గోవా, క్రైస్‌ ఈవాన్స్‌, సల్మాన్‌, డేవిడ్‌ బోరీన్జ్‌, నోయా మిల్స్‌, హెన్రీ కావిల్‌, టామ్‌ హిడిల్‌స్టోన్‌ తరువాత స్థానాల్లో నిలిచారు. హృతిక్‌ ఇప్పుడు మేథమేటిసియన్‌ ఆనంద్‌ కుమార్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ‘సూపర్‌ 30’ సినిమాలో చేస్తున్నాడు. వికాశ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో 2020 క్రిస్మస్‌కు విడుదల కానున్న ‘క్రిష్‌ 4’ కూడా చేస్తున్నాడు.