ఈ విడిపోయిన జంటకు మళ్లీ పెళ్లి !

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌కు కూడా భార్య, పిల్లల గురించి తెలిసొచ్చింది. బాలీవుడ్ హీరోలకు ప్రేమలు ఎక్కువే. విడిపోవడాలు కూడా ఎక్కువే. రోజులు గడిస్తే కానీ ఆ ప్రేమ వెనకున్న బంధాల గురించి అర్థం కాదు.  కొంతకాలం క్రితం భార్య సుసానే ఖాన్‌కు విడాకులిచ్చిన హృతిక్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు…

14 ఏళ్ల క్రితం తన చిన్ననాటి స్నేహితురాలు సుసానేఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు హృతిక్. వీరికి ఇద్దరు కొడుకులున్నారు. అయితే హీరోయిన్ కంగనారనౌత్‌తో హృతిక్ చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో వారి వివాహ బంధం బీటలు వారింది. ఆతర్వాత ఇద్దరు విడాకులు తీసుకున్నా హృతిక్, సుసానే స్నేహితులుగా ఉంటున్నారు. తరచుగా హృతిక్ తన పిల్లలు, సుసానేతో కలిసి విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొడుకుల కోసం మళ్లీ ఈ జంట ఒక్కటి అయ్యేందుకు సిద్ధమైందని తెలిసింది. హృతిక్ తన తప్పు తెలుసుకొని ఇప్పుడు సుసానేను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడని సమాచారం.

గ్రాండ్‌ విజువల్స్‌తో భారీగా రెండు సీక్వెల్స్‌
‘క్రిష్‌’ 4, 5 సినిమాలను ఒకేసారి షూట్‌ చేసి, ఎడిట్‌ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారట చిత్రబృందం. ఇండియన్‌ సూపర్‌ హీరో ‘క్రిష్‌’ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేశాడు. అందుకే వరుసగా సీక్వెల్స్‌ రూపొందిస్తున్నారు దర్శక–నిర్మాత రాకేష్‌ రోషన్‌. ఆల్రెడీ ‘క్రిష్‌ 4’ని 2020 క్రిస్మస్‌ స్పెషల్‌గా రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నట్టు హృతిక్‌ బర్త్‌ డే  రోజున అనౌన్స్‌ చేశారు హృతిక్‌ తండ్రి రాకేష్‌ రోషన్‌. ఇప్పుడు ‘క్రిష్‌ 5’ కూడా రూపొందించే ఆలోచనలో ఉన్నారని బాలీవుడ్‌ టాక్‌. ఈ రెండు సీక్వెల్స్‌కు ఇంటర్నేషనల్‌ టెక్నీషియన్స్‌ వర్క్‌ చేయనున్నారట. గత పార్ట్స్‌ని మించి గ్రాండ్‌ విజువల్స్‌తో భారీగా ఉంటాయని సమాచారం.పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌కి ఎక్కువ టైమ్‌ పడుతుందని సమాచారం.
 
ప్రీతీ జింటా, ప్రియాంకా చోప్రా గత సినిమాల్లో హీరోయిన్లుగా కనిపించారు. ఈ కొత్త సీక్వెల్స్‌లో కొత్త కాంబినేషన్‌ సెట్‌ అవ్వొచ్చట. మరి.. ఈ సూపర్‌ హీరోని మళ్లీ స్క్రీన్‌ మీద చూడాలంటే మరో రెండు మూడేళ్లు వేచి చూడక తప్పదు. అన్నట్లు ఒకేసారి షూట్‌ చేయబోతున్నారు కాబట్టి ఒకేసారి రిలీజ్‌ చేస్తారేమో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అది జరగనే జరగదు. ముందు ఫోర్త్‌ పార్ట్‌ రిలీజ్‌ చేస్తారు. ఫిఫ్త్‌ పార్ట్‌ టెక్నికల్‌గా ఇంకా భారీగా ఉండటంతో ముందు షూట్‌ చేయాలనుకున్నారట.