`ఐ రావ‌ణ‌` ఫ‌స్ట్ లుక్ , మోష‌న్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ !

అనీల్ బుర‌గాని (‘వ‌జ్రాలు కావాలా నాయ‌నా’ ఫేం) కరీమ్ మునీశా జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `ఐ రావ‌ణ‌`. క‌ళ్యాణ్ శ్రీ వ‌ర్మ ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం అవుతున్నారు. దాన్య ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ర‌త్న సంధ్య నిర్మిస్తున్నారు.  ఈ సినిమా  ఫ‌స్ట్ లుక్ , మోష‌న్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ లో జ‌రిగింది. న‌టుడు, `మా` అధ్య‌క్షుడు శివాజీ రాజా పోస్ట‌ర్, ఫ‌స్టు లుక్ ను ఆవిష్కరించారు.
అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ… ` ఈరోజు తెలుగు సినిమా ఇండ‌స్ర్టీకి మ‌రో కొత్త ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం అవుతున్నాడు. క‌ళ్యాణ్ గ‌తంలో షార్ట్ ఫిలింస్ చేసి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఒక‌ప్పుడు సినిమా డైరెక్ట్ చేయాలంటే చాలా స‌మ‌యం ప‌ట్టేది. కానీ ఇప్పుటి త‌రం అంతా షార్ట్ ఫిలింస్ తో ట్యాలెంట్ ప్రూవ్ చేసుకుని త్వ‌ర‌గా ద‌ర్శ‌కులు అవుతున్నారు. పోస్ట‌ర్ బాగుంది. క‌థ కాన్సెప్ట్ చ‌క్క‌గా ఉంది. సినిమా విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు రావాలి` అని అన్నారు.
 హీరో అనీల్ బుర‌గాని మాట్లాడుతూ… `  శివాజీ రాజాగారు చేతుల మీదుగా పోస్ట‌ర్ లాంచ్ చేయ‌డం సంతోషంగా ఉంది. ఇది నాకు రెండ‌వ సినిమా. ఇందులో కామ‌న్ మ్యాన్ గా కామ్ గోయింగ్ పాత్ర‌లో క‌నిపిస్తా. బాధ్య‌త అంటే ఎంటో చెప్పే సినిమా ఇది. షూటింగ్ దాదాపు పూర్త‌యింది. మంచి అవుట్ ఫుట్ వ‌చ్చింది. ఎలాంటి అస‌భ్య‌క‌ర స‌న్నివేశాలకు తావు లేకుండా అంద‌ర్నీ అల‌రించే సినిమా ఇది` అని అన్నారు.
ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ వ‌ర్మ మాట్లాడుతూ… ` రెస్పాన్స్ బులిటీ’ అనే పాయింట్ కు రామాయ‌ణంలో రావ‌ణుడి క్యారెక్ట‌ర్ ను ఆపాదించి తెర‌కెక్కించిన సినిమా ఇది. అందుకే ‘ఐ రావ‌ణ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశాం. బాద్య‌త గురించి మా హీరో ఎలా రియక్ట్ అయ్యాడు? యువ‌త‌కు ఇచ్చిన సందేశం ఏంటి? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఇందులో హీరోయిన్ జాబ్ సెర్చింగ్ గ‌ర్ల్ గా క‌నిపించ‌నుంది. క‌థ‌నం ఆస‌క్తిక‌రంగా సాగుతుంది.  టాకీ పార్టు పూర్త‌యింది. మొత్తం ఐదు పాట‌లున్నారు. రెండు బ్యాలెన్స్ పాట‌ల‌ను షూట్ చేయాల్సి ఉంది. త్వ‌ర‌లోనే ఆ ప‌నులు కూడా పూర్తిచేసి ట్రైల‌ర్, టీజ‌ర్, ఆడియో రిలీజ్ చేస్తాం.  తెలుగు ప్రేక్ష‌కులంతా మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.
హీరోయిన్ క‌రీమ్ మునిశా మాట్లాడుతూ…` కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ఇది.  ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా తెర‌కెక్కిస్తున్నారు. అనీల్ మంచి స‌హ‌న‌టుడు. అంతా కొత్త వాళ్లైనా బాగా న‌టించారు. అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది` అని అన్నారు.
ఈ  చిత్రంలో హ‌రి ఎడ్ల‌ప‌ల్లి, ఆర్. జె చందు ( రేడియో జాకీ) త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం: సతీష్ ముదిరాజ్, నేప‌థ్య సంగీతం: అర‌వింద్ రామా, నిర్మాత‌: ర‌త్న సంధ్య‌, ద‌ర్శ‌కుడు: క‌ళ్యాణ్ శ్రీ వ‌ర్మ‌.