‘ఐఐటీ కృష్ణమూర్తి’ టీజర్ విడుదల

పృద్వీ దండమూడి, మైరా దోషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఐఐటీ కృష్ణమూర్తి ‘. కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ్ కుమార్ పాత్ర సమర్పిస్తున్న ఈ సినిమా ని క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై ప్రసాద్ నేకూరి నిర్మిస్తున్నారు.. వినూత్నమైన కథా కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను కె.ఎస్ రామారావు, విడుదల చేశారు.
 
కె.ఎస్‌ రామారావు మాట్లాడుతూ.. చిత్ర దర్శకుడు శ్రీ వర్ధన్ చాలా మంచి వ్యక్తి. టాలెంటెడ్. టీజర్ చూస్తే నే అర్థమవుతుంది . టిజర్ లో ఏదో వుంది . హీరో హీరోయిన్ బాగున్నారు. టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నానన్నారు.
 
రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. ‘ఐఐటి కృష్ణమూర్తి’ టైటిల్ వెరైటీ గా టీజర్ ఇంటెన్స్ గా చాలా బాగుంది. మంచి కాన్సెప్ట్ .‌ యూత్ అందరు కలిసి చెసిన ఈ సినిమా నిర్మాతకు సక్సెస్ ను అందించాలని ఆశిస్తున్నానన్నారు.
 
చిత్ర దర్శకుడుశ్రీ వర్దన్ మాట్లాడుతూ.. విచ్చెసిన గెస్ట్ లకు ధన్యవాదాలు. నేటి తరానికి నచ్చెలా ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ను తీశాము. నిర్మాత సపోర్ట్ అప్పటికి మరచిపోలేము . అందరికి మా “ఐఐటి కృష్ణమూర్తి” నచ్చుతాడని నమ్ముతున్నామన్నారు.
 
సంగీత దర్శకుడు నరేష్ కుమారన్ మాట్లాడుతూ.. ఇదోక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అందరు జెన్యూన్ గా కష్టపడ్డామన్నారు.
 
చిత్ర సమర్పకులు ప్రేమ్ కుమార్ పాత్ర మాట్లాడుతూ.. ఈ చిత్ర నిర్మాత ప్రసాద్ నీకూరి తొలిసారి అయినా విషయం ఉన్న మంచి సినిమా చేశారు. ఈ టీమ్ కు సక్సెస్ రావాలని ఆశిస్తున్నాను అన్నారు.
 
నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ..‌ సినిమా ఫీల్డ్ నాకు కొత్త. ఈ చిత్ర దర్శకుడు రైటర్ పట్టుదల ,కథ నచ్చి ఈ సినిమా చేశాం. ఈ కాన్సెప్ట్ యూనివర్సల్ . అది నచ్చి ప్రేమ్ కుమార్ సపోర్ట్ చేశారన్నారు.
 
హీరో పృధ్వీ దండమూడి మాట్లాడుతూ.. నేను హీరో అయినా, మా టీమ్ మెంబర్స్ ఈ చిత్రానికి రియల్ హీరోస్. నిర్మాత ప్రసాద్ గారు అవగాహన లేకపోయినా కథ పైన తనకున్న నమ్మకంతో ఈ సినిమా చేశారు‌. అందరు కష్టపడి బెస్ట్ ఔట్పుట్ రావటానికి కృషి చేశాం.
 
ఇంకా ఈ కార్యక్రమంలో తుమ్మల పల్లి రామ సత్యనారాయణ, సురేష్ కొండేటి, సాయి వెంకట్, రమేష్ మద్దినేని , బాబ్జీ ,రామ్ రావిపల్లి తదితరులు పాల్గొన్నారు
 
పృద్వీ దండమూడి, మైరా దోషి, వినయ్ వర్మ, భారతి ఆనంద్, బెనర్జీ, కమెడియన్ సత్య తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి దర్శకుడు : శ్రీ వర్ధన్,సమర్పణ : ప్రేమ్ కుమార్ పాత్ర,నిర్మాత : ప్రసాద్ నేకూరి,
బ్యానర్ : క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ , సినిమాటోగ్రఫీ: యేసు.పి, సంగీతం: నరేష్ కుమారన్,
ఎడిటర్ : అనిల్ కుమార్.పి,రచన : నాగార్జున మనపాక, గీత రచయిత : రామాంజనేయులు సంకర్పూ,
లైన్ ప్రొడ్యూసర్ : ఎల్.వి. వాసుకి,