కెరీర్ క్లోజ్ అయిపోతుందని భయపడి చెప్పరు !

సినీ పరిశ్రమపై తన హాట్ కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తోంది ఇలియానా. సినిమా మేకింగ్ దశల్లో దర్శకుల క్రియేటివిటీతో తను ఎదుర్కొన్న ఇబ్బందులను ఆ మధ్య వివరించి చెప్పింది ఈమె. తన తొలి సినిమా‘దేవదాసు’ రూపొందిస్తున్న సమయంలో నడుముపై దర్శకుడు శంఖాన్ని వదిలినప్పుడు నొప్పి పెట్టిందని ఆ మధ్య ఇలియానా వ్యాఖ్యానించింది. అవే వ్యాఖ్యలను రిపీట్ చేసింది కూడా.

ఇక తాజాగా ఈ గోవా భామ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల అంశంపై స్పందించింది. అవి పరిశ్రమలో సర్వసాధారణమే అని అంటోంది ఇలియానా. తన వ్యక్తిగత అనుభవాలను చెప్పలేదు కానీ, తనతో ఎవరో ఒక జూనియర్ ఆర్టిస్టు చెప్పుకున్న విషయాన్ని ఇలియానా ప్రస్తావించింది. ఒక సీనియర్ నిర్మాత వేధిస్తున్నాడు అని అంటూ.. ఒక జూనియర్ ఆర్టిస్టు తన వద్దకు వచ్చి చెప్పుకుందని.. ఏం చేయమంటారు? అని తన సలహా అడిగిందని ఇలియానా చెప్పుకొచ్చింది.దానికి స్పందిస్తూ ‘నేను చెప్పేదేం లేదు.. నువ్వే నిర్ణయించుకో..’ అని తను సమాధానం ఇచ్చానని ఇలియానా వివరించింది.

‘ఇలాంటి లైంగిక వేధింపులు ఇండస్ట్రీలో సహజమే అని.. అయితే ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్న అమ్మాయిలు నోరు విప్పలేరని’ కూడా ఇలియానా వ్యాఖ్యానించింది. ‘వాటిపై స్పందిస్తే.. అక్కడితో కెరీర్ క్లోజ్ అయిపోతుందని చాలా మంది భయపడతారు.. అందుకే ఈ వ్యవహారాలు బయటకు రావు’ అని ఓపెన్ గా చెప్పింది ఈ హీరోయిన్. అలాగని ఇండస్ట్రీలో అమ్మాయిలపై ఇలాంటి వేధింపులను తను సమర్థించడం లేదని, వాటి విషయంలో ఎలా స్పందించాలో హీరోయిన్లే ఎవరికి వారు నిర్ణయించుకుంటారని ఇలియానా అభిప్రాయపడిందిఅవకాశాల కోసం చాలామంది మహిళలు అటువంటి పనులకు అంగీకరిస్తున్నారు. అందువల్ల, ముందుకు వెళ్ళాలా? లేదా? అనేది వాళ్ళిష్టానికి వదిలేయాలి’’ అని ఇలియానా పేర్కొన్నారు. కానీ, ఆ బడా నిర్మాత ఎవరో చెప్పలేదు. ఇంకొకటి… హీరోలను అమితంగా ఆరాధించే మన దేశంలో వారు అటువంటి పనులు చేస్తారని నిరూపించడమూ, ప్రజలను నమ్మించడమూ కష్టమేనన్నారు.

దీనిపై ఇలియానా మాట్లాడుతూ… ‘‘ఒకవేళ పెద్ద పెద్ద స్టార్లపై లైగింక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు వస్తే… పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లతో సహా ఎక్కువమంది ప్రజలు ముందుకు వస్తే తప్ప మార్పు తీసుకురాలేం. మన దేశంలో నటులను ప్రేక్షకులు ఎంతగానో ఆరాధిస్తారు. అలాంటి నటుల్లో నీచమైన ప్రవృత్త కూడా ఉందని నిరూపించాలంటే చాలామంది గొంతు విప్పాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అలాంటివాడే అని చెప్పాలి. నేను ఇకపై కెవిన్‌ స్పేసీ (హాలీవుడ్‌ నటుడు) షో చూడను. ఇంతకు ముందు నేను అతణ్ణి , అతని నటనను ఇష్టపడ్డాను. ఇప్పుడు అతను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. వ్యక్తిగా అతనంటే నాకు అసహ్యం వేస్తోంది’’ అన్నారు.