నేను చేసేది తప్పని చెప్పే హక్కు ఎవరికీ లేదు !

ఇలియానా నటించిన ‘బాద్‌షాహో’ సినిమా బాక్స్‌ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న వారిలో గోవా భామ ఇలియానా ఒకరు. అవకాశాలు తగ్గినట్లు అనిపించిన ప్రతీసారి ఏదో ఒక హాట్ ఫొటో షూట్ తో ఇటీవలికాలంలోఆమె  బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.మరోవైపు ఇలియనా మాత్రంమీడియా మీద మండిపడుతున్నారు. అందుకు ఈ అమ్మడు చెప్పిన కారణం ఇదీ…..

గత కొన్ని నెలలుగా ఎక్కడికి వెళ్లినా, ఏ ఫంక్షన్ కు హాజరైనా అందరూ ఇలియానాను అడిగేది మాత్రం ఆండ్రూ  గురించే. అతడు ఆమె బాయ్ ఫ్రెండ్ ..అని ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రియుడు ఆండ్రూ గురించే పదే పదే పబ్లిక్ లో ప్రతి ఈవెంట్లోనూ అడుగుతుండటం తనకు చికాకు తెప్పిస్తోందన్నారు. ‘నేను పబ్లిక్ ఫిగర్‌ని మాత్రమే.. అంతేకానీ పబ్లిక్ ప్రాపర్టీని కాదు’ అంటూ స్టేట్ మెంటే ఇచ్చారు. ప్రియుడి గురించి అడగటంతో తప్పులేదు కానీ అతడి జాతి గురించి, అతడు తెల్లగా ఉన్నాడని, డేటింగ్ చేస్తోందంటూ …వదంతులు ప్రచారం చేయడం బాధ కలిగిస్తోందంటూ వాపోయారు.  ‘తాను చేసేది తప్పని చెప్పే హక్కు ఎవరికీ లేదని, ఎవరి పని వారు చూసుకుంటే మంచిద’ని మీడియాకు  హితవు పలికారు ఇలియానా.