ఇక్కడ కష్టపడి పనిచేసేవారికి విలువ ఉండదు!

ఇలియానా తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న క్రమంలోనే బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ ఆమె నటించిన సినిమాలు కొన్నిహిట్‌ అయినప్పటికీ ఇలియానాకు మాత్రం అవకాశాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఆ సమయంలో  ఆస్ట్రేలియన్‌ ఫొటోగ్రాఫర్‌తో ప్రేమయాణం నడిపింది. అతనితో విడిపోయాక తిరిగి సినిమాలపై దృష్టి పెట్టింది. అయితే బాలీవుడ్‌కు వెళ్లిపోయాక ఇలియానా పలుమార్లు టాలీవుడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలియానా సినీ పరిశ్రమపై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. సినీ పరిశ్రమ అంటేనే క్రూరమైందంటూ ఘాటుగా స్పందించింది.

‘‘ఫిల్మ్‌ ఇండస్ట్రీ చాలా క్రూరమైనది. ఇక్కడ జీవించడం చాలా కష్టం. ప్రజలు చూసేంతవరకే మేం స్టార్లుగా ఉంటాం. ఒక్కసారి వాళ్లు మా నుంచి తల తిప్పుకుంటే.. అంతే ఇంకా మేము అన్నింటినీ కోల్పోతాము. నా విషయంలో అదే జరిగింది’’ అంటూ ఇలియానా చెప్పుకొచ్చింది. చిత్ర పరిశ్రమ గురించి చెప్పడానికి ఎన్నో చెడ్డ విషయాలు ఉన్నాయని.. అయితే, ఇది డబ్బు సంపాదింఛి పెట్టే యంత్రమనే విషయాన్ని  ఒప్పుకోకతప్పదని చెప్పంది.  అదే విధంగా ‘మన అభిరుచికి అనుగుణంగా పరిశ్రమలో ప్రతీదీ జరగాలనే నియమం లేదు. మన అనుమతి లేకుండా చాలా విషయాలు జరుగుతాయి. మనం వాటిని తట్టుకుని.. ఎలాంటి సంఘటనలను అయినా స్వీకరించడానికి ప్రయత్నించాలి. ఇక్కడ కష్టపడి పనిచేసేవారికి విలువ ఉండదు. ప్ర‌జ‌ల ఫోక‌స్ ను బ‌ట్టే ఇక్కడ విలువ, కెరీర్ ఉంటుంది’ అని ఆమె తెలిపింది. కాగా ఆమె తనకు నచ్చని హీరోలా సినిమాలు అసలు చూడనని కూడా చెప్పింది.

అమెజాన్ ప్రైమ్‌ కోసం టాక్‌ షో!… కరోనా పుణ్యమా అని డిజిటల్‌ మీడియాకి డిమాండ్‌ పెరిగింది. స్టార్‌ హీరోలతో పాటు హీరోయిన్లు కూడా డిజిటల్‌ ఎంట్రీ ఇస్తున్నారు. డిజిటల్‌లో వెబ్‌ సీరీస్‌లతో పాటు టాక్‌ షోలకు కూడా మంచి డిమాండ్‌ ఏర్పడింది. వాటిలో ముఖ్యంగా స్టార్‌ హీరోయిన్లు చేసే టాక్‌ షోకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది . దీంతో టీవీ చానళ్లతో పాటు ఓటీటీ సంస్థలు కూడా పేరున్న హీరోయిన్లను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం సమంత ఓ టాక్‌ షోని చేసింది.ఆ షోకి మంచి స్పందనే వచ్చింది. ఇక తమన్నాతో సైతం ఓ టాక్‌ షోకి ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పుడు గోవా బ్యూటీ ఇలియానా కూడా డిజిటల్‌ ఎంట్రీకి సిద్ధమైందని  సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌ వీడియో కోసం ఇలియానా ఓ టాక్‌ షో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిగిపోయాయట. దక్షిణాదికి చెందిన ఓ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో తొలుత ఓ సీజన్‌ని చేసి విడుదల చేస్తారట. దానికి వచ్చిన రెస్పాన్స్‌ని బట్టి మరో సీజన్‌ని ప్లాన్‌ చేయాలని భావిస్తున్నారట. ఇక ఈ టాక్‌ షో కోసం ఇలియానా భారీగానే పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

కొత్త బిజినెస్‌ ప్లాన్‌ చేస్తోందట!… దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ తెచ్చుకున్న ఇలియానా కొత్త బిజినెస్‌ మొదలుపెట్టేందుకు ప్లాన్‌ చేస్తోందట. అందులో భాగంగానే బేకరీ, రెస్టారెంట్లు వంటి చైన్‌ బిజినెస్‌ చేయాలనే ఆలోచనలో ఉందని సమాచారం. హీరోయిన్‌గా తనకు ఉన్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని తన పేరుతోనే వీటిని మార్కెట్‌ చేసుకోవాలని అనుకుంటోంది. అయితే ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల్లో ‘కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం అంటే రిస్క్‌ చేసినట్టే’ అని కొందరు అన్నారట. ఇలియానా కూడా ఈ ఆలోచనతోనే లాక్‌డౌన్‌ తర్వాతే వ్యాపారం ఆరంభించాలని అనుకుంటున్నట్లు బాలీవుడ్‌ టాక్‌.