పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి !

ఇలియానా డిక్రుజ్… గ్లామర్ పరంగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది గోవా బ్యూటీ ఇలియానా. గత కొంతకాలంగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీ అయిన ఈ భామ ఇటీవలే ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది .తాజాగా ఓ మీడియా సంస్థతో తన వ్యక్తిగత విషయాలు ముచ్చటించింది ఇలియానా..
‘‘దాదాపు పదిహేనేళ్ళు బాడీ డిస్మోర్ఫిక్‌ డిజార్డర్‌తో బాధపడ్డా. ఆ టైమ్‌లో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకుందామని కూడా అనుకున్నా. ఈ వ్యాధి కారణంగా ‘ఇక సినిమాల్లో నటించలేనేమో’ అనిపించేది. నాకు వచ్చిన వ్యాధి లక్షణం అలాంటిది. అయితే అప్పుడు నా సన్నిహితులు, కుటుంబ సభ్యులు నాకు అండగా ఉన్నారు. మూడేళ్ల క్రితం ఈ వ్యాధి నుంచి బయటపడ్డా. ఇప్పుడు ఆ వ్యాధి తాలూకు లక్షణాలేవీ నాలో లేవు. దీనికి కారణం నా కుటుంబ సభ్యులందించిన సహకారమే. ప్రస్తుతం ఆ విషయాలను గుర్తు చేసుకుంటేనే భయమేస్తోంది. అసలు నేను ఇలా ప్రవర్తించానా?’’ అని అనిపిస్తోందని చెప్పింది ఇలియానా.
 
ఇలియానా కేరాఫ్ అడ్రస్‌ ఫిజీ !
అవకాశాలు అడుగంటినప్పుడు ముద్దుగుమ్మలు ప్రయోగించే ఆఖరి అస్త్రం సోయగాల ప్రదర్శన. సోషల్ మీడియా ప్రస్తుతం అలాంటి స్కిన్ షోస్‌కు అడ్డాగా మారడడంతో ఒకప్సటి క్రేజీ భామ ఇలియానా కూడా చేరింది. ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో స్విమ్ వేర్ షో షురూ చేసింది. బాయ్ ఫ్రెండ్ ఆండ్రూస్‌తో కలసి సాగరతీరాన సేదతీరుతూ… షార్ట్ డ్రెస్ వేసుకుని ఫొటో షూట్స్‌లో భాగంగా ఇల్లీ తాజా హాట్ పిక్… సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది . అందులో ఇలియానా అల్ట్రా మోడ్రన్ లుక్ ఫెంటాస్టిక్ అంటూ నెటిజెన్లు తెగ ఆనందపడిపోతున్నారు.’కెవ్వు కేక’ అంటూ ఇలియానా అందాల్ని ఓ రేంజ్‌లో ఆకాశానికెత్తేస్తున్నారు. మరి ఈ రేంజ్‌లో అందాల షోకి సిద్ధపడిన ఇల్లీ ఇప్పుడు తన కేరాఫ్ అడ్రస్‌ను ఫిజీకి మార్చింది ఇలియానా. ఫిజీ దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్న ఆమె వీలున్నప్పుడల్లా అక్కడ సంచరిస్తూ బికినీ ఫొటోషూట్లతో హీటెక్కిస్తోంది.మరి ఈ రేంజ్‌లో అందాల షోకి సిద్ధపడిన ఇల్లీకి అవకాశాలు ఏ రేంజ్‌లో వచ్చిపడతాయో చూడాలి