సోషల్ మీడియానే నమ్ముకుంటోంది !

‘గోవా బ్యూటీ’ ఇలియానా… అవకాశాలు అంతంత మాత్రంగా ఉండడంతో లైమ్‌లైట్‌లో ఉండేందుకు సోషల్ మీడియానే నమ్ముకుంటోంది. ఇప్పటికే తన ఫొటోలతో హల్‌చల్ చేస్తూ యూత్‌ను ఆకట్టుకుంటోంది. ఇలియానా వేదాంతం కూడా వల్లిస్తోంది. ఇటీవల ఇలియానా తన ప్రేమికుడితో విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రేమ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది ఇలియానా…
“ప్రేమలో విఫలమైతే ఆ వ్యక్తితో ఇంకెప్పటికీ మాట్లాడకూడదు. అయితే ప్రేమలో పడ్డవారు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకోవాలి తప్ప.. లేనిపోని అపార్థాలకు లోనుకాకూడదు” అని ఇలియానా చెప్పింది. “నాకు దేవుడిపై నమ్మకం లేదు… ఎక్కడో ఉన్న అదృశ్యశక్తి మనల్ని నడిపిస్తోంది అంటే నమ్మడం నాకు నచ్చదు. అయితే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే” అని చెప్పింది ఈ బ్యూటీ.
 
అందుకే పాత ఫోటోలు పెడుతోంది
ఇలియానా తన ఫోటోలతో అభిమానులను, సినీ ప్రేక్షకులను మోసం లాంటిది చేస్తోందట. ఎలాగంటే…ఇలియానా ఇటీవలి కాలంలో బాగా బరువు పెరిగిపోయి ముద్దు గుమ్మ కాస్తా బొద్దుగుమ్మగా మారిపోయింది. తన ఆకారంపై ఎన్ని కామెంట్లు వచ్చినా.. అప్పట్లో ఇలియానా పట్టించుకోలేదు. ఎందుకంటే…అప్పట్లో ఇలియానా పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయింది. ఆ ప్రేమ మైకం కాస్త దిగిపోయిన తరువాత వాస్తవం కనిపించింది. దాంతో పెరిగిన బరువును అత్యవసరంగా తగ్గించుకునే పనిలో పడింది.
బరువు తగ్గిన తరువాత తన ఫోటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే బాగుండేది . కానీ తన పాత ఫోటోలు కొత్త ఫోటోలు అన్నట్టుగా బిల్డప్‌ ఇస్తూ.. సోషల్ మీడియాలో పోస్టు చేయడమే వివాదం అవుతోంది. నిజానికి ఇలియానా ఫొటోల్లో ఉన్నంతగా స్లిమ్‌ కాలేదనీ, తను బరువు తగ్గలేదన్న విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి అలా పాత ఫోటోలు పెడుతోందని అంటున్నారు. ఇంతకీ ‘ఎవరిని మోసం చేయడానికి ఈ ఫోటోల డ్రామా’.. అని కూడా కామెంట్ చేస్తున్నారు..
హిందీ లో ఇలియానా ‘పాగల్‌ పంతీ’
ఇలియానా హిందీ లో చేస్తున్న ‘పాగల్‌ పంతీ’ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. వైఫై భాయ్‌… అతని పవర్‌తోనే నెట్‌వర్క్‌ నడుస్తుందట. ఈ పవర్‌ సిగ్నల్స్‌కి ముందుగా రాజ్‌ కిషోర్, సంజనలు స్పందిస్తారు. మరి.. తన పవర్‌తో వైఫై భాయ్‌ ఏమేం పనులు చేశారో వెండితెరపై చూడాల్సిందే. వైఫై భాయ్‌ పాత్రలో అనిల్‌ కపూర్, సంజన పాత్రలో ఇలియానా, రాజ్‌ కిషోర్‌ పాత్రలో జాన్‌ అబ్రహాం కనిపిస్తారు.అనీస్‌ బాజ్మీ దర్శకత్వంలో అనిల్‌ కపూర్, ఇలియానా, జాన్‌ అబ్రహాం, అర్షద్‌ వార్షి తో తెరకెక్కిన ‘పాగల్‌ పంతీ’లో పుల్‌కిత్‌ సామ్రాట్, కృతీ కర్భందా, ఊర్వశీ రౌతేలా, సౌరభ్‌ శుక్లా కీలక పాత్రధారులు. ఈ సినిమాను  నవంబరు 22న విడుదల చేస్తున్నారు.